టీజర్ టాక్: యాక్షన్ మోడ్ లో కాటమరాయుడు.. పూనకం తెప్పించేశాడు | Katamarayudu teaser out.

Pawan kalyan katamarayudu teaser released

Pawan Kalyan, Katamarayudu Teaser, Katamarayudu Official Trailer, Katamarayudu Dialogue, Pawan kalyan New Movie Teaser, Pawan kalyan Teaser, Katamarayudu Teaser, Power Star Katamarayudu, katamarayudu movie, katamarayudu 2017

Pawan Kalyan’s Katamarayudu Movie Teaser Released.This romantic family entertainer is an official remake of Tamil blockbuster Veeram. This remake is directed by Dolly and produced under the Northstar Entertainment Banner.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ రిలీజ్

Posted: 02/04/2017 04:24 PM IST
Pawan kalyan katamarayudu teaser released

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. వారిని ఖుషీ చేస్తూ కాసేపటి క్రితం కాటమరాయుడు టీజర్ వచ్చేసింది. నిర్మాత శరత్ మరార్ కాసేపటి క్రితం దానిని రిలీజ్ చేసేశాడు. కంప్లీట్ యాక్షన్ పార్ట్ తో కూడిన ఈ టీజర్ వీఎఫ్ ఎఫెక్ట్స్ మూలంగానే ఆలస్యం అయ్యిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఏదైతేనేం ఎట్టకేలకు రిలీజ్ చేయటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ మార్క్ బ్యాగ్రౌండ్ తో మొదలైన టీజర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నింపేశారు. పవన్ పంచె పైకి ఎగ్గట్టే సందర్భం నుంచి చివరిదాకా ఓ ఊపు ఊపేసింది. కాటమరాయుడి లుక్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు పవన్. ఫైట్స్ లో కూడా చెలరేగిపోయాడు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం.. అన్న డైలాగ్ పేలిపోయింది.

 

మరోవైపు తమ్ముళ్లతో కలిసి డాన్స్ చేసే బిట్ చూపించటంతో ఆ సీన్ హిల్లేరియస్ గా ఉండబోతుందని అర్థమౌతోంది. ఆలస్యంగా వచ్చిన కాటమరాయుడితో పవన్ మాంచి కిక్కు ఇచ్చాడంటూ సంబరపడిపోతున్నారు పవన్ అభిమానులు. ప్రస్తుతం టీజర్ ట్రెండ్ అవుతూ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu  Teaser  

Other Articles