ఆ సైకో నటుడు హీరోయిన్ ను ఎంతలా టార్చర్ పెట్టాడంటే... | Nana Patekar aces the psychopath act again.

Wedding anniversary official trailer out

Nana Patekar, Mahie Gill, Nana Patekar Mahie Gill, Wedding Anniversary Movie, Wedding Anniversary 2017, Wedding Anniversary Bollywood Movie, Wedding Anniversary Trailer, Wedding Anniversary Nana Patekar, Nana Patekar Psychopath Act, Nana Patekar New Movie Trailer

Wedding Anniversary Official Trailer released. Nana Patekar once again shows his aces the psychopath act. The eccentric actor is very much in his elements, as against a convincingly vulnerable Mahie Gill, whose last Bollywood appearance was 'Buddha In a Traffic Jam'.

నానా పటేకర్ వెడ్డింగ్ యానీవర్సరీ ట్రైలర్ రిలీజ్

Posted: 02/04/2017 03:41 PM IST
Wedding anniversary official trailer out

ఒక్కో నటుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ, సెంట్రిక్ నటుడు నానాపటేకర్ ది మాత్రం చాలా ఢిపరెంట్. మిగతా పాత్రల సంగతి ఏమోగానీ సైకో పాత్రల్లో మాత్రం ఆయన సిన్సియారిటీ చాలా బాగా కనిపిస్తుంది. అలాంటి వాటిని అలవోకగా పోషించటంలో నానాది ప్రత్యేకమైన స్టైల్. పరింద, అగ్ని సాక్షిలో ఈ ఉత్తమ నటుడి నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అలాంటి నటుడు గత కొంతకాలంగా సినిమాలు చేయటం బాగా తగ్గించేశాడు.

చివరిసారిగా మరాఠీ ఫిల్మ్ నటసామ్రాట్ లో విజృంభించేసిన ఇతగాడు ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమాతో రాబోతున్నాడు. అదే వెడ్డింగ్ యానివర్సరీ . ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది. హాట్ బ్యూటీ మహిగిల్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తన ఫస్ట్ మ్యారేజీ యానివర్సరీకి భర్త తన పక్కన లేకపోవటంతో ఓ భార్య దిగాలుగా ఉండటం, అప్పుడే పరిచయం అయిన ఓ వ్యక్తి తాను ఆమెతో జాయిన్ అవ్వటం, అంతా హ్యాపీగా సాగుతున్న టైంలో తనపై చిరాకు పడ్డ మహికి చుక్కలు చూపించే పాత్రలో నానా జీవించేశాడు. వీరి రేర్ కాంబో కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తోంది. మహి ఓవైపు సెక్సీ అప్పీల్ తో కనిపిస్తూనే, మరోవైపు నటన కూడా చించేసింది.

 

ఇక ట్రైలర్ చివర్లో జీవితంలో ప్రతీక్షణాలను చివరి క్షణాలే అనుకోవాలి.. అప్పుడే లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతాం అంటూ తన మోడ్యుల్ లో చెప్పే డైలాగ్ హైలెట్ గా పేలింది. ఈ చిత్రానిని నానాపటేకర్ సహనిర్మాతగా వ్యవహరించటం విశేషం. శేఖర్ ఝా దర్శకత్వం వహించిన వెడ్డింగ్ ఆనివర్సరీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nana Patekar  Wedding Anniversary  Official Trailer  mahie Gill  

Other Articles