అఫైర్, అట్టర్ ఫ్లాపులతో పాపం ఆ హీరోయిన్ | Shraddha's Daaku Daddy Shakti Kapoor turns nosy.

Shakti kapoor starts interfere in daughter career

Shraddha Kapoor, Shakti Kapoor, Shraddha Kapoor New Mentor, Shakti Kapoor PRO, Shraddha Kapoor New PRO, Shraddha Kapoor 2017 Movies, Shraddha Kapoor Upcoming Movies, Shakti Kapoor New Avatar, Shakti Kapoor Daughter, Shraddha Kapoor Father

Shraddha Kapoor is in not so great shape after delivering two flops Ok Jaanu and Rock On 2. The once most bankable actress, Shraddha, is now reeling under the pressure of coming up with a hit film and soon. Shakti Kapoor will perhaps look into her professional matters, like so many other star dads.

కూతురి రెండు దెబ్బలకి తండ్రి శ్రద్ధ

Posted: 01/30/2017 03:10 PM IST
Shakti kapoor starts interfere in daughter career

ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్లకు హిట్లు పడ్డప్పటికీ ఫ్రెష్ ఫేసుల కారణంగా ఆఫర్లు అంతంగా మాత్రంగానే వస్తున్న రోజులివి. అలాంటిది వరుసగా రెండు డిజాస్టర్లు ఖాతాలో పడితే ఇంకేమైనా ఉందా?. ప్రస్తుతం బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ పరిస్థితి ఇలాగే ఉంది. శక్తికపూర్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన నటనతో మెస్మరైజ్ చేసి తనకంటూ ఓ సొంత గుర్తింపును సొంతం చేసుకుంది.

అయితే గత కొంతకాలంగా నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తో అఫైర్ తో వార్తల్లో తెగనానిన శ్రద్ధ వరుసగా రెండు ఫ్లాపులు పడేసరికి గప్ చుప్ అయిపోయింది. ఫర్హాన్ తోనే చేసిన రాక్ ఆన్ -2, ఒకే బంగారం రీమేక్ ఒకే జానులు శ్రద్ధ ఇమేజ్ ను ఘోరంగా దెబ్బతీశాయి. కథల సంగతి పక్కనపెడితే అసలు ఏ మాత్రం నటనతో ఆకట్టుకోలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో ఆమె తండ్రి శక్తికపూర్ స్వయంగా రంగంలోకి దిగాడు.

ఇప్పుడున్న మేనేజర్ తొలగించి తానే స్వయంగా దగ్గరుండి కూతురి కెరీర్ ను తీర్చి దిద్దే పనిలో ఉన్నాడు. కొత్త ప్రాజెక్టులపై సైన్ చేయటం దగ్గరి నుంచి, అన్ని విషయాలను తానే స్వయంగా చూసుకుంటానని కూడా చెబుతున్నాడు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు కూతుళ్ల విషయంలో ఇదే పద్ధతి ఫాలో అవుతుండగా, ఇప్పుడు శక్తి కపూర్ కూడా ఆ రూట్ లోకి వచ్చేశాడు. చూద్దాం ఈరకంగానైనా శ్రద్ధా కెరీర్ గాడిలో పడుతుందేమో. అన్నట్లు అర్జున్ కపూర్ సరసన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో శ్రద్ధ నటిస్తుండగా, సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakti Kapoor  Daughter  Shraddha Kapoor  PRO  

Other Articles