లాస్య సీక్రెట్ ఎంగేజ్ మెంట్... కాబోయే భర్త ఇతనే... | Anchor Lasya Secretly Engaged.

Tollywood anchor lasya engagement

Telugu Anchor Lasya, Anchor Lasya Engaged, Lasya Engagement, Anchor Secret Engagement, Anchor Lasya, Lasya Husband, Anchor Secret Engagement, Lasya Engagement, Anchor Lasya with Husband, Anchor Lasya Wedding, Lasya Soulmate

Anchor Lasya got engaged. yesterday she took her social media to convey the news about her engagement. She stated that she was getting ready for a special day in her career and it feels good. She continued and said that she was engaged with her soulmate. She claimed that she was excited with this. However, there is no official confirmation or photos regarding this except her posts in social networking handle. She has been favorite for many young boys in AP and Telangana with her anchoring. She became famous with ‘Something Something’ in MAA Music along with anchor Ravi.

యాంకర్ లాస్య ఎంగేజ్ మెంట్.. వరుడు సీక్రెట్

Posted: 01/30/2017 01:34 PM IST
Tollywood anchor lasya engagement

బుల్లితెరపై వెలుగు వెలిగిన లాస్య కొంత కాలంగా స్క్రీన్ కు దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో లేనిపోని రూమర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్ సైట్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ యాంకర్ లాస్య వీడియోలను పోస్ట్ చేసింది. అసలు తన వ్యక్తిగత లైఫ్ లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటని పెద్ద క్లాసే తీసుకుంది. కట్ చేస్తే... ఇంతలోనే హఠాత్తుగా నిన్న తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ సందేశం హాట్ టాపిక్ గా మారింది.

త‌న ఎంగేజ్‌మెంట్‌పై అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసేసింది ఈ తెలుగు యాంకర్. నా సోల్ మేట్‌తో ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అవుతున్నా… చాల ఎగ్జైటింగ్‌గా ఉంది…అంటూ సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫ్యాన్స్‌కు చెప్పింది. అంతేకాదు ఈ ఉదయం ఏకంగా ఎంగేజ్ మెంట్ అయ్యాక ఓ ఫోటోను కూడా ఉంచేసింది.

ప్రేమ అనేది చాలా విలువైనదంటూ ట్రెడిషనల్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను పెట్టేసింది. అయితే ఇంత చెప్పినా అతగాడు ఎవరో మాత్రం లాస్య రివీల్ చేయలేదు. తొలినాళ్లలో ఓ కో యాంకర్ తో, ఆపై హీరో రాజ్ తరుణ్ తో ఏకంగా సీక్రెట్ వివాహం చేసుకుందని లాస్యపై రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మ‌రోవైపు కెరీర్ జోరుమీద ఉండ‌గానే లాస్య యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి రాజా మీరు కేక అనే ఓ చిత్రంలో నటించింది. ఇప్పుడేమో ఇలా సడన్ ఎంగేజ్‌మెంట్ తో షాకులిచ్చేసింది. ప్రస్తుతం ఆ అజ్నాత వ్యక్తి ఎవరో చెప్పాలంటూ లాస్యను విజ్నప్తి చేస్తున్నారు పలువురు. దీంతో సాయంత్రం ఐదు గంటలకు అతని ఫోటోలను రివీల్ చేేసేసింది. మరాఠీ యువకుడైన మంజునాథ్ తో గత కొంత కాలంగా ఆమె ప్రేమలో ఉందంట. ఇరు కుటుంబాలను ఒప్పించి తాము ఒకటైనట్లు చెబుతోంది లాస్య. 

 

Lasya Engagement

Anchor Lasya Secret Engagement

Lasya Majunath

Anchor Lasya Secret Boyfriend

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu  Anchor Lasya  Engagement  

Other Articles