జల్లికట్టు నిరసనలో సీక్రెట్ గా విజయ్ చేసిన పనితో అంతా షాక్ | vijay-shocking public protest for jallikattu.

Vijay simplicity in jallikattu protest

Iilayathalapathy vijay, vijay jallikattu, Jallikattu Protest, Marina Beach Jallikattu, Vijay at Marina Beach, Vijay in Jallikattu Protest, Hero Vijay secret visiting, Star Hero Jallikattu Secret Protest

Actor Vijay simplicity in Jallikattu protest. shocking every one that secret appearance in public protest for jallikattu at Marina beach.

జల్లికట్టు నిరసనలో స్టార్ హీరో సింప్లిసిటీ

Posted: 01/21/2017 10:32 AM IST
Vijay simplicity in jallikattu protest

జల్లికట్టుపై కేంద్రం ఆర్డినెన్స్ తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అది అమలయ్యే దాకా తగ్గేది లేదంటూ యావత్ తమిళ యువత మెరీనా బీచ్ లో తిష్ట వేసి కూర్చుంది. రాజకీయ, సినీ వర్గాలు కూడా వారికి మద్ధతు పలకటం, పైగా వివాదం అంతర్జాతీయ మీడియాలో కూడా హైలెట్ కావటం, పరిస్థితి ముదిరిపోతుందని గమనించిన ప్రభుత్వం జల్లికట్టుపై సానుకూలంగా స్పందించింది.

అయితే కోలీవుడ్ ఈ పోరాటంలో చూపిన చొరవకు ప్రత్యేక అభినందనలు కురుస్తున్నాయి. నడిగర్ సంఘం తరపున రజనీ, కమల్, అజిత్,సూర్య లాంటి స్టార్లు నిరాహర దీక్షకు కూర్చోవటం, ధనుష్ అయితే ఏకంగా తన పెటా అవార్డు(వెజిటేరియన్) తీసుకున్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటం, అంతెందుకు ముందు జల్లికట్టును వ్యతిరేకించిన త్రిష దెబ్బకి దిగొచ్చి మద్ధతు ఇవ్వటం, వీరిందరిని మించి ఏకంగా కోటి రూపాయల సాయం ప్రకటించి లారెన్స్ సూపర్ హీరో గా ప్రశంసలు అందుకోవటం తదితర పరిణామాలు చూశాం. అయితే ఈ ఊపులో మరో స్టార్ హీరో ఎవరికీ కనిపించకపోవటంపై కాస్త విమర్శలు వినిపించాయి.

సూపర్ స్టార్ తలైవా తర్వాత అంతటి మాస్ పాలోయింగ్ ఉన్న విజయ్ జల్లికట్టుకు మద్ధతు ప్రకటించినప్పటికీ, ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ,  మిగతా హీరోల మాదిరి కాకుండా తానేంటో మరోసారి చూపించాడు. ఏకంగా మెరీనా బీచ్ లోని ఆందోళనకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిమానులు ఎగబడిపోతారన్న ఉద్దేశంతో ఎవరూ గుర్తుపడకుండా ఉండేందుకు ముఖానికి ముసుగు కట్టుకుని మరీ ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అలాగే ఉండి ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూల్ గా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి.

Hero Vijay Jallikattu

 

Vijay at Marina Beach ProtestHero Vijay Jallikattu Protest

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iilayathalapathy  vijay  Jallikattu  Marina Beach  Protest  

Other Articles