శాతకర్ణి తెలుగు వాడు కాదా? జాతీయ మీడియా లో కథనం | Krish on Satakarni fiction history.

Krish angry on satakarni fiction for history comments

Director Krish, Gautamiputra Satakarni, Satakarni fiction for history, Krish Satakarni fiction, Director Krish Angry, Satakarni Controversy

Director Krish angry on Satakarni fiction for history comments. National Media publish story Telugu film mistakes fiction for history as it invokes regional pride.

నేనేం గుడ్డిగా సినిమా తీయలేదు: క్రిష్

Posted: 01/21/2017 08:28 AM IST
Krish angry on satakarni fiction for history comments

ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు దానిని ప్రశంసించేవారు ఎంత మంది ఉంటారో... లోపాలను పట్టుకుని అనవసర వివాదాలు రేపే బ్యాచ్ కూడా కొందరు ఉంటారు. ఎక్కడో చోట తగిలే నెగటివ్ పాయింట్ ను పట్టుకుని అనవసర రాద్ధాంతం చేయటం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. దంగల్ లో ఫిక్షన్(కల్పితం) జోడించాడంటూ అమీర్ పై విమర్శలు రావటం చూసిందే. అయితే స్వేచ్ఛను వాడుకుంటేనే అలాంటి సినిమాల్లో సీన్లు పండుతాయని తర్వాత మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ వివరణ ఇచ్చుకున్నాడు లేండి.

ఇదిలా ఉండగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో దర్శకుడు క్రిష్ టోటల్ గా చరిత్రనే వక్రీకరించారంటూ కొందరు (చరిత్రకారులని చెప్పుకుంటున్నారు) విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కల్పితాలు పెట్టుకోవచ్చని... కానీ, దానిని చరిత్ర అంటూ ఉద్ఘాటిస్తే చూస్తూ ఊరుకోవాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై క్రిష్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. తాను చేసిన ఓ గొప్ప ప్రయత్నాన్ని కించపరిచేలా వారు వ్యవహరిస్తున్నారని... అలాంటి వారి వ్యాఖ్యల పట్ల స్పందించాల్సిన అవసరంలేదని అంటున్నాడు.

‘‘తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒకడని అన్న విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తిలో చెప్పారు. నన్ను విమర్శించే వాళ్లకు ఆయన కన్నా ఎక్కువ తెలుసా వారికి? పరబ్రహ్మ శాస్త్రిది తప్పుడు వాదన అంటారా? ఎన్టీ రామారావుగారు కూడా శాతకర్ణి సినిమా చేయాలనుకున్నారు. నిజంగా శాతకర్ణి తెలుగు వాడు కాకపోతే ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలని అనుకునేవారా? నేను ఏమీ తెలుసుకోకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? నేను మరీ అంత సోమరిని కాదు. కళ్లు మూసుకుని సినిమా తీయలేదు.

కొన్ని పుస్తకాలు చదివితే వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి నేను చిన్నపుడు చదువుకున్న కథలోంచి కొన్ని అంశాలు తీసుకుని స్క్రిప్ట్ తయారు చేశాను. సినిమాలో చాలా వరకు నిజాలే చూపించే ప్రయత్నం చేశాను. నన్ను విమర్శించేవాళ్లవన్నీ నిరాధార ఆరోపణలే. నన్ను నా ప్రయత్నాన్ని చిన్నబుచ్చాలని చూస్తున్న వారి విమర్శలకు నేను స్పందించను’’ అని క్రిష్ తేల్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Gautamiputra Satakarni  Historical Mistake  

Other Articles