పిగ్గీ చాప్స్ మళ్లీ కుమ్మేసింది.. ప్రతిష్టాత్మక అవార్డు రెండో సారి | Priyanka Chopra wins her 2nd People's Choice Award.

Priyanka chopra wins people s choice award for quantico

Priyanka Chopra, People's Choice Award, Priyanka Chopra 2nd International Award, Quantico People's Choice Award, Priyanka Chopra People's Choice Award, People's Choice Award 2017, People's Choice Award red carpet, People's Choice Award 2017 Priyanka Chopra, Priyanka Chopra People's Choice

Priyanka Chopra wins second People's Choice Awards for Quantico, owns red carpet too."Quantico" actress Priyanka Chopra wins her 2nd People's Choice Award.

పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కించుకున్న పింకీ

Posted: 01/19/2017 12:32 PM IST
Priyanka chopra wins people s choice award for quantico

ప్రతిష్టాత్మక పీపుల్స్ ఛాయిస్ అవార్డుల్లో బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండోసారి ఆ అవార్డును కైవసం చేసుకుంది. అమెరికన్‌ టీవీ షో క్వాంటికో సిరీస్ కు గాను ఈ అవార్డ్ దక్కింది. గతేడాది ఫెవరెట్ కొత్త నటిగా అవార్డు అందుకున్న పింకీ ఈసారి ఫెవరెట్ నటిగా అవార్డు తన ఖాతాలో వేసకుంది. క్వాంటికో సిరీస్‌లో ప్రియాంకా ఎఫ్‌బీఐ రిక్రూట్ పాత్ర‌ను పోషించిన విషయం తెలిసిందే.

మూవీ, టీవీ, యానిమేషన్ తదితర విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. లాస్ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రియాంకా ఈ అవార్డును అందుకుంది. ఈ అవార్డు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంద‌ని త‌న‌తో పాటు నామినేట్ అయిన తోటిన‌టీమ‌ణుల‌కు అభినంద‌నలు తెలిపింది ప్రియాంకా. వారంద‌రి స‌హ‌కారంతోనే బుల్లితెర‌పై కూడా రాణిస్తున్న‌ట్లు తెలిపారు. త‌ను ఇంత‌టి స్థాయికి చేరేందుకు స‌హ‌క‌రించి మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అని తెలిపింది.

కాగా, ఇటీవలె 'క్వాంటికో' షూటింగ్‌లో ఉండగా ప్రమాదానికి గురై ఆస్పత్రిపాలైన ప్రియాంక, గాయం ఇబ్బంది పెడుతున్నా కార్యక్రమానికి హాజరవ్వటం విశేషం. (ఎక్కడెక్కడ గాయాలయ్యాయంటే...)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : People's Choice Award  Priyanka Chopra  2nd time  Quantico series  

Other Articles