అమ్మ సినిమా ఉంది.. ప్రీరిలీజ్ పంక్షన్ కి వెళతాను.. శాతకర్ణితో పోటీ ఉండదు | Dasari about Jaya biopic and Satakarni Khaidi clash.

Dasari about khaidi and satakarni clash

Dasari Naayana rao, Jayalalitha Biopic, Khaidi No 150 pre release function, Dasari about chiru came back, Dasari Chiranjeevi pre release function, Dasari Satakarni Khaidi clash, Dasari Amma Movie, Darshaka Ratna Dasari Narayana Rao, Dasari Naayana rao Sasikala Natarajan, Dasari Khaidi No 150, Dasari Gautamiputra Satakarni

Darshaka Ratna Dasari Naayana rao confirmed Jayalalitha biopic. Dasari said he attend to Chiru 150 Khaidi No 150 pre release function. and open up about Khaidi and Satakarni Clash.

ఖైదీ, శాతకర్ణి పెద్ద సమస్యేం కాదు

Posted: 01/04/2017 05:39 PM IST
Dasari about khaidi and satakarni clash

గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు క్రేజీ అనౌన్స్ మెంట్ తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత జీవితంపై బయోపిక్ తీసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న వార్త గత రెండు మూడు రోజులుగా వార్తల్లో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త నిజమేనని స్వయంగా ఆయనే ప్రకటించారు. అంతేకాదు  ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నానని చెప్పిన ఆయన లీడ్ రోల్(రమ్యకృష్ణ, త్రిష పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్) ఎవరిదో చెప్పకుండా కొత్త వాళ్లతో కేవలం నెల రోజుల్లో సినిమా తెరకెక్కిస్తానని షాక్ ఇచ్చారు.

ఇక ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ వేడుకకు మరో దిగ్గజం రాఘవేంద్రరావుతో కలిసి హాజరవుతానని చెప్పేశాడు. గతంలో చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని, చిరు ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని ఆయన తెలిపాడు. తనకు అవసరమైన స్టార్ డమ్ చిరు ఇప్పటికే సంపాదించేశాడని, అయితే ఆ క్రేజ్ ఉందా? లేదా? అని చెప్పడానికి ఈ సినిమా పునాది అవుతుందని తెలిపాడు. ఇక ఖైదీ కోసం చిరు కష్టం గురించి కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని తెలిపాడు.

తన 50 ఏళ్ల కెరీర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తానేదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరని ఆయన తెలిపారు. టాలీవుడ్ లో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలను భరించగల శక్తి ఉంటుందని ఆయన అన్నారు. తొలి రోజు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా చూస్తారని, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒక సినిమా చూస్తారని ఆయన అన్నారు. అలాంటిది రెండు పెద్ద సినిమాలన్నది పెద్ద సమస్య కాదని.. 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు ఒకేసారి విడుదలవడంపై ఆయన వ్యాఖ్యానించారు. రెండూ వేటికవే వైవిధ్యమైన కథాంశం గల సినిమాలని ఆయన చెప్పారు. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరిస్తారని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles