ఖైదీ రైతు పాట నిజంగా బాగోలేదా? | meag fans complaint on Khaidi Neeru song.

Khaidi rhythu concept song released

Chiranjeevi, Khaidi No 150, Neeru Neeru song, Khaidi neeru song, Khaidi last track, Khaidi Rhythu Concept Song, Chiru last track, Neeru Neeru Song, Khaidi Audio review, Khaidi No 150 Farmer song

Megastar Chiranjeevi new movie Khaidi No 150 last track Neeru Neeru released.

ఖైదీ చివరి పాట ఎలా ఉందంటే...

Posted: 01/05/2017 10:02 AM IST
Khaidi rhythu concept song released

 
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి మరో పాటను యూట్యూబ్ లో విడుదలైంది. అయితే ఇప్పటిదాకా కేవలం మాస్ అండ్ యూత్ ఫుల్ బీట్ తో అలరించిన చిరు ఒక్కసారిగా పంథా మార్చేశాడు. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే రైతు పాట అది. అన్నదాత కష్టాలు.. కడగండ్ల నేపథ్యంలో చిత్రీకరించిన ‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’ అంటూ సాగే ఈ పాట ప్రతిఒక్కరినీ టచ్ చేసేలా ఉంది.

ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవీ మెలోడీయస్ ట్యూన్ ఇచ్చాడు. సినిమా అసలు కథ అంతా కూడా ఓ ఊరికి చెందిన రైతుల నీటి సమస్య గురించి సాగుతుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఆ ఎపిసోడ్ వస్తుంది. మాతృక కత్తిలో ఆ సమయంలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. అదే తెలుగులో ఈ నీరు నీరు సాంగ్ అయి ఉండొచ్చు. పాట వినగానే హృదయానికి హత్తుకునేలా ఉందంటే అందుకు మహదేవన్ వాయిస్ లోని మ్యాజిక్ అనే చెప్పుకోవాలి. ఈ పాటను రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది ఖైదీ టీం.
 
 


అయితే ఇంద్ర, ఠాగూర్ లోని మెసేజ్ ఓరియంటల్ సాంగ్స్ మాదిరి అంత ఎఫెక్టివ్ గా లేదన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, గొంతు ఎండిపోయే.. పేగు మండిపోయే.. గంగ తల్లి జాడలేదని''.. అన్న లిరిక్స్ లోని డెప్త్ మాత్రం బాగా ఆకట్టుకుంది. గత పాటలు హీరోయిజంను ఎలివేట్ చేయగా, ఇది కేవలం రైతుల ఆర్తనాదాన్నే చూపించే పాట కాబట్టి ఇలాగే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇంతకుముందు విడుదల చేసిన పాటల్లో ముఖ్యంగా ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటకు, రత్తాలు ఐటెం సాంగ్ భారీ స్పందన వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Neeru Neeru Song  Farmer Song  

Other Articles