టాలీవుడ్ బెస్ట్ హీరోను మీరే తేల్చండి | Tollywood poll 2016 for best hero

Tollywood best hero 2016

Tollywood 2016, Tollywood round up 2016, telugu best movie 2016, telugu best hero 2016, telugu best actress 2016, telugu wishesh tollywood poll, tollywood best performance

Tollywood best hero poll 2016.

టాలీవుడ్-2016 బెస్ట్ హీరో ఎవరంటే...

Posted: 12/28/2016 12:41 PM IST
Tollywood best hero 2016

2016 మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది టాలీవుడ్ లో మొత్తం 105 సినిమాల దాకా వచ్చాయి. డబ్బింగ్ తో కలుపుకుని మరో పాతిక ఎక్కువ. అంటే 125 సినిమాలు. ఊహించని సర్ ప్రైజ్ లు,  షాకులు ఎన్నో తగలియాయి. మరి ఎవరెవరూ ఎలా గడిపేశారో ఓ లుక్కేస్తే... ఏడాది మొదటి రోజునే నేను శైలజతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్.  చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతి బరిలో దిగిన నాలుగు సినిమాలు(నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయన) బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.  నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్, ఎక్స్ ప్రెస్ రాజాతో శర్వానంద్, డిక్టేటర్ తో నటసింహ బాలయ్య, సోగ్గాడే చిన్నినాయనతో అయితే నాగ్ ఏకంగా ఫస్ట్ టైం 50 కోట్ల మార్కు అందుకున్నాడు. ఇక ఆపై ఫిబ్రవరిలో కూడా జర్నీ కొనసాగింది. గతేడాది రెండు చిత్రాలతో సక్సెస్ బాట పట్టిన నేచురల్ స్టార్ నాని కృష్ణగాడి వీర ప్రేమగాథతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇక టాలీవుడ్ లో ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్న అడవి శేష్ క్షణంతో మంచి హిట్ అందుకున్నాడు. పెట్టుబడి కంటే మూడింతల కలెక్షన్లు రాబట్టింది నిర్మాణ సంస్థ పీవీపీ.  

మార్చిలో వచ్చిన నాగ్-కార్తీ మల్టీస్టారర్ ఊపిరి మరోసారి క్లాసిక్ చిత్రాలను గుర్తుకు తెవటమే కాదు. బిగ్ హిట్ గా నిలిచి నిర్మాతలకు భారీ లాభాలు అప్పజెప్పింది. ఇక ఏప్రిల్ మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో పెద్ద దెబ్బ వేస్తే, మరో అగ్ర నటుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో భారీ డిజాస్టర్ అందించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అంచనాలకు అందని రీతిలో  రెండు సినిమాలు భారీ కలెక్షన్లతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించాయి. సరైనోడుతో అల్లు అర్జున్ సాలిడ్ హిట్ కొట్టగా, జనతా గ్యారేజ్ టాలీవుడ్ టాప్-3లో తన స్థానం పదిలపరుచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డబ్బింగ్ చిత్రాలకు ఈ యేడాది అంతంత మాత్రగానే కలిసి వచ్చినప్పటికీ, సూర్య 24 తమిళ్ లో అట్టర్ ప్లాప్ కాగా, తెలుగు లో మాత్రం హిట్ గా నిలిచింది. విక్రమ్ ఇంకొక్కడు(ఇరుమురుగన్) కూడా మంచి కలెక్షన్లే సాధించింది. ఇక విజయ్ ఆంటోనీ బిచ్చగాడు(పిచ్చైకారన్) రేపిన కలెక్షన్ల సునామీ మరిచిపోలేం. కేవలం 40 లక్షలతో కొన్న ఈ కోలీవుడ్ రీమేక్ 10 కోట్లపైగా కలెక్షన్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ యేడాది చివర్లో వచ్చిన మోహన్ లాల్ మన్యం పులి(పులి మురుగన్ రీమేక్) కూడా డీసెంట్ వసూళ్లనే సాధించింది. 


చిన్న సంచలనం...
ఇవన్నీ ఒక ఎత్తయితే సైలెంట్ సినిమాగా వచ్చి పెద్ద షాకే ఇచ్చింది పెళ్లి చూపులు. నిర్మాత సురేష్ బాబు నమ్మకం వమ్ము కాకుండా భారీ లాభాలను కట్టబెట్టిందీ చిత్రం. నేచురల్ స్టార్ నాని తన విజయ పరంపరను కొనసాగిస్తూ జెంటిల్మెన్, మజ్నులతో హిట్లు అందుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ సుప్రీంతో హిట్ అందకుని, తిక్కతో డిజాస్టర్ చవిచూశాడు. రామ్ కి హైపర్ దెబ్బేసింది. నాగ్ నిర్మలా కాన్వెంట్ శ్రీకాంత్ తనయుడికి చేదు అనుభవం ఇచ్చింది.  విష్ణు, రాజ్ తరుణ్ ఈడో రకం అడో రకం తో మాస్ హిట్ అందుకున్నారు. నారా రోహిత్ తుంటరి, సావిత్రి, శంకర లతో ఫ్లాప్ లు చవిచూడగా, జో అచ్యుతానందతో హిట్ అందుకుని, అప్పట్లో ఒకడుండేవాడు రిలీజ్ కు రెడీ అయిపోయింది. సునీల్, ఆది, అల్లరి నరేష్ లాంటి హీరోలకు ఈ యేడాది అస్సలు కలిసి రాలేదు. నరేష్ తనయుడు నవీన్ నందిని  నర్సింగ్ హోంతో, కమెడియన్ శ్రీనివాస రెడ్డి జయమ్ము నిశ్చయమ్ము రా ఫర్వాలేదనిపించాయి.

చివర్లో నోట్ల రద్దును లెక్క చేయకుండా నిఖిల్ ఎక్కడికి పోతావ్ చిన్నవాడా,  తనిఒరువన్ రీమేక్ తో చెర్రీ ధృవగా కలెక్షన్లు కుమ్మేసుకున్నారు. ఓవరాల్ గా ఈ యేడాది టాలీవుడ్ లో బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ల ఆధారంగా హీరోలతో కూడిన జాబితా తయారు చేశాం. ఫెర్ ఫార్మెన్స్, అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆ చిత్రంకు వచ్చిన క్రేజ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేయటం జరిగింది.  దీని ద్వారా మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నదే తెలుగు విశేష్ ప్రయత్నం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tollywood 2016  best hero  Poll  

Other Articles