భార్యకు అటాచ్ బాత్ రూం ఉన్న గదిని ఇవ్వాలంటూ దర్శకుడికి కోర్టు ఆదేశం | Delhi court asks director to provide shelter to estranged wife.

Film director accused of domestic violence

Siddharth Srinivasan, Pairon Talle Director, Director Domestic Violence, Siddharth Srinivasan wife, Siddharth Srinivasan Divya, director to provide shelter to estranged wife

Siddharth Srinivasan, best known for his acclaimed movie Pairon Talle, was asked by a Delhi court to provide a separate room, with attached washroom, for his estranged wife.

ఫేమస్ దర్శకుడిపై గృహహింస ఆరోపణలు

Posted: 12/23/2016 05:52 PM IST
Film director accused of domestic violence

మరో దర్శకుడు వ్యక్తిగత వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. సంచలన చిత్రం పైరన్‌ తల్లె (సాండ్స్‌ ఆఫ్‌ సోల్స్‌) ఫేమ్ సిద్ధార్థ శ్రీనివాసన్ గృహహింస కేసును ఎదుర్కొంటున్నాడు. అతని భార్య దివ్యా భరద్వాజన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 2013లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన భర్త శ్రీనివాసన్, అతని తల్లి తనను వదిలేసి వెళ్లిపోయారని... ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక తాను తన పుట్టింటికి వెళ్లానని దివ్య తన పిటిషన్ లో తెలిపింది.

తాను తిరిగి రాగా... తన భర్త మకాం మార్చడమే కాక, కొత్తింట్లోకి తనను రానీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పింది. విడాకులు ఇవ్వాలంటూ భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని తెలిపింది. తాను ఇంట్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని... తనకు భరణం ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ, దివ్య గృహహింసను అనుభవిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. సొంతిల్లు లేని ఆమెను ఇంట్లోకి పిలుచుకోవాలని, అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్న గదిని ఆమెకు కేటాయించాలని ఆదేశించింది. అయితే, దివ్యను ఇంటి నుంచి గెంటివేయలేదని శ్రీనివాసన్ తరపు లాయర్ వాదించాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటే వివాదం మరింత పెరుగుతుందని కోర్టుకు తెలిపాడు. అయితే, లాయర్ వాదనను కోర్టు కొట్టివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddharth Srinivasan  Pairon Talle Director  Domestic Violence  

Other Articles