అచ్చం చెర్రీలా ఉన్నాడా? ఎలాగెలాగా? | chiranjeevi looks like charan Khaidi.

Khaidi romantic look revealed

Khaidi No 150, Khaidi wih Sundari, Khaidi romantic angle, Sundari song from Khaidi No 150, Chiru still young at 61, Chiru romance Kajal, Khaidi No 150 Christmas, Chiranjeevi 150th Movie, Khaidi No 150 new song, Khaidi No 150 Sundari Song, Khaidi No 150 Chiru and Kajal, Chiru in Sundari Song, Khaidi No 150 Sundari Song release poster

Khaidi No 150 Sundari song released on the eve of Christmas.

సుందరితో మెగాస్టార్.. వాట్ ఏ రొమాన్స్

Posted: 12/23/2016 03:59 PM IST
Khaidi romantic look revealed

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉంది. సరైనోడుతో మొదలైన ఫ్రీ రిలీజ్ పంక్షన్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఆడియో వేడుక లేకుండా 25న పాటలను డైరెక్ట్గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ పాట యూట్యూబ్ సెన్సేషన్గా మారింది.

ఇక ఇప్పుడు సుందరీ వంతు వచ్చింది. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు చందమామ కాజల్. స్లొవేనియాలో తీసిన ఈ పాట ఒక స్టిల్ తో ఒక మెగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అబ్బో ఆ పోస్టర్ ఉంది చూస్కోండి.. మెగాస్టార్ మరింత యంగ్ అయిపోయాడు. 61 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే లుక్ తో చిరు ఆకట్టుకున్నాడు. ఇప్పటిదాకా పోస్టర్లలో మాస్ యాంగిల్ లో చించేసిన చిరు ఇందులో మాత్రం రొమాంటిక్ బెస్ట్ అందించాడు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ పోస్టర్లో చిరు అచ్చు చరణ్ లాగే కనిపిస్తున్నాడు అన్న డైలాగ్ వినిపిస్తుంటే.. బ్రూస్ లీ లోని ఎలగెలాగా అన్న చిరు మాటలు గుర్తురాక మానదు. చరణ్.. బన్నీ.. పవన్ లతో చేసిన రొమాన్స్ చేసిన కాజల్ చిరుతో కూడా ఏ మాత్రం తగ్గలేదనే అనుకోవచ్చు. జనవరి 1న ట్రైలర్, 4న ప్రీ రిలీజ్ పంక్షన్, సంక్రాంతి కానుకగా 12న ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Sundari Song  Christmas gift  

Other Articles

Today on Telugu Wishesh