లాస్య సూసైడ్.. వీడియో హల్ చల్... | Lasya old video viral again.

Anchor lasya fire on websites

Anchor Lasya fire, Anchor Lasya suicide, Lasya old video, Lasya fire, Anchor lasya suicide video, Lasya fire on media, Anchor lasya fake news, Lasya news, Anchor Lasya rumours

Anchor Lasya fire on websites about cheap tricks with her suicide news.

యాంకర్ లాస్య వీడియో బిగ్ మిస్టేక్

Posted: 12/21/2016 03:57 PM IST
Anchor lasya fire on websites

సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాల్లోకి మన మీడియా తొంగి చూసినంత మరెవ్వరూ చూడలేరేమో. ఫోటో చిక్కినా.. కాస్త క్లోజ్ గా కనిపించినా అర్థం పర్థం లేని డబుల్ మీనింగ్ టైటిళ్లతో హెడ్డింగులు పెట్టి కల్పిత కథనాలు ఇబ్బందుల పాలు చేస్తారు. టాలీవుడ్ లో బిజీ యాంకర్ గా ఉండి ఈ మధ్య కాస్త రెస్ట్ తీసుకున్న అచ్చ తెలుగు యాంకర్ లాస్య విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది.

ఆ మధ్య నటుడు రాజ్ తరుణ్ తో దిగిన ఓ ఫోటోను పట్టుకుని ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకున్నారంటూ పిచ్చ కథనాలు ప్రచురించాయి కొన్ని వెబ్ సైట్లు. ఇక ఇప్పుడు తెరపై సందడి చేయకపోటంతో ఏకంగా ఆత్మహత్య యత్నం చేసిందంటూ మరో వార్త రాసేసి పైశాచిక ఆనందం పొందాయి. దీంతో మండిపోయిన లాస్య ఓ వీడియోను పోస్ట్ చేసి క్లాస్ పీకింది.

 

"హాయ్... చూస్తున్నారుగా.. ఎంత హ్యాపీగా ఉన్నానో. నా పర్సనల్ లైఫ్ లో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. ఈ మధ్య షోస్ చేయడం లేదంటే చిన్న బ్రేక్ అంతే.. త్వరలో ఓ మంచి ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు నేనో విషయంపై మీతో మాట్లాడాలని అనుకుంటన్నాను. చిన్నవి.. చీప్ వెబ్ సైట్స్ ఏవైతో ఉన్నాయో వాటి గురించి మాత్రమే. అన్ని వెబ్ సైట్స్ గురించి నేను మాట్లాడ్డం లేదు. కొన్ని ప్రమోట్ చేసేవి ఉన్నాయి. కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేసే వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడూ దేనిమీదా నేను రియాక్ట్ అవ్వలేదు. ఓ చీప్ వెబ్ సైట్ నా పేరు వాడుకుని నామీద ఓ రూమర్ స్ప్రెడ్ చేశారు" అంటూ ఒక్కసారిగా సీరియస్ వర్షన్ లోకి మారిపోయింది.

"నేను హాస్పిటలైజ్ అయినట్లు.. ఇంకోదే జరిగిపోయినట్లు(సూసైడ్ అటెంప్ట్) రాస్తున్నారు. దీనిక్కూడా రియాక్ట్ అవ్వాలని నేను అనుకోలేదు. కాకపోతే నన్ను ప్రేమించే నావాళ్లు.. నాకు ఫోన్ లు చేస్తున్నారు. ఏంటీ ఆ వార్త నిజమా అని అడుగుతున్నారు. అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రతీ ఒక్కరూ నమ్మేస్తున్నారనే ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాను. చూస్తున్నారుగా నేను బావున్నాను. చాలా బావున్నాను. నాకేమీ కాలేదు. ప్రొఫెషనల్ గా కూడా అందరూ నన్ను ప్రేమిస్తారు. అందరితో నేను బాగుంటాను. ఎవరితో ఎలాంటిప్రాబ్లెం లేదు. మేం మేం చాలా బాగుంటామండీ. ఈ రాసేవాళ్లు ఏదేదో రాస్కుంటూ ఉంటారు. నన్ను దీవించేవాళ్లు అందరికీ థాంక్యూ'" అంటూ ముగించింది లాస్య. అయితే తర్వాత తెలిసిన ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో ఓ నాలుగునెలల క్రితందని. ఆ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం ‘‘రాజా మీరు కేక’’ అనే చిత్రంతో త్వరలో వెండితెరపై కూడా సందడి చేయబోతుందంటండీ ఈ క్రేజీ యాంకర్. ఇందులో తారకరత్న విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Lasya  Suicide Fake News  Fire on cheap websites video  

Other Articles