అమ్మడు.. కుమ్ముడు... చిరు రేంజ్ కి తగ్గట్లులేదా? | Ammadu Lets Do Kummudu not in chiru range.

Ammadu lets do kummudu song record views

Ammadu Lets Do Kummudu, Khaidi No 150, Megastar Chiranjeevi, Chiru 150th movie, Ammadu song in youtube, Ammadu Lets Do Kummudu record, Chiru and Kajal Ammadu Lets Do Kummudu

Ammadu Lets Do Kummudu Khaidi No 150 out and create sensation in youtube.

లిరిక్స్ వీడియోతో చిరు సంచలనం

Posted: 12/20/2016 09:55 AM IST
Ammadu lets do kummudu song record views

మెగా అభిమానులే కాదు.. మొత్తం టాలీవుడ్ జనాలు ఆసక్తిగా చిరు రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఆడియో వేడుక ఉండబోదని, డైరక్ట్ ప్రీ రిలీజ్ పంక్షన్ చేస్తామని ప్రకటించటంతో కాస్త నిరాశ చెందినప్పటికీ, నేరుగా రిలీజ్ అయ్యే ట్రాక్ లో ఫస్ట్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఖైదీనెం150 చిత్రంలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు జనాలు హోరెత్తిపోతున్నారు. ‘దిస్ ఈజ్ నాట్ ఏ మాస్ సాంగ్. దిస్ ఈజ్ బాస్ సాంగ్’ అంటూ దేవి శ్రీ ప్రసాద్ గొంతుతో మొదలయ్యే ఈ పాట ఇప్పటివరకూ దాదాపు 22లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఇంకా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఓ ఆడియో సాంగ్ ఇంతలేసి రెస్పాన్స్ రావడం..మ్యూజిక్ రైట్స్ తీసుకున్న ఆడియో కంపెనీకి కూడా షాక్ ని ఇచ్చేసిందట.

 

కేవలం అఫీషియల్ పేజీల వీక్షకులతోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న చిరు ఖచ్ఛితంగా సినిమాతో మరికొన్ని రికార్డులు నెలకొల్పటం ఖాయమని అభిమానులు ఊగిపోతున్నారు. అయితే మెగా రీఎంట్రీ దేవిశ్రీప్రసాద్ వంటి అబిరుచి ఉన్న సంగీత దర్సకుడు నుంచి ఇటువంటి అవుట్ డేటెడ్ సాంగ్ ఊహించలేకపోయామంటూ కొందరు కామెంట్స్ చేయటం విశేషం. బాలయ్య సినిమాను వదలుకుని మరీ ఇంతటి నాసికరం ట్యూన్ ఇవ్వటంపై పెదవి విరుస్తున్నారు. అంచనాలను అందుకోలేకపోయాడంటూ ఇంకోందరు అంటున్నారు.

మొత్తానికి ఫ్యాన్స్ ఊపుతో కేవలం లిరికల్ వీడియో టీజర్ తో రికార్డ్ వ్యూస్ దక్కించుకున ఈ చిత్రం, పూర్తి స్థాయి పాటలతో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాత చెర్రీ ఇదివరకే ప్రకటించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles