ధృవ హిట్టా? ఫ్లాపా? చెర్రీయే చెప్పేస్తున్నాడు | Ram Charan on Dhruva success,

Ram charan on his past movies

Ram Charan Dhruva, Dhruva hit or Flop, Ram Charan Nani, Nani Sharwanand, Cherry jealousy, Charan About Dhruva result, Charan Dhruva collections, Dhruva Movie total collections

Ram Charan open up his past movies and Mass follow ism. And says why he jealous with Sharwanand and Nani.

చెర్రీ చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు

Posted: 12/20/2016 08:41 AM IST
Ram charan on his past movies

గతం తనకు చాలా నేర్పిందని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. రెగ్యులర్ మసాలా మూవీస్ తో తాను చాలా సగటు ప్రేక్షకుడిని చాలా విసిగించానని, ఇకపై అలాంటి పనులు చేయబోనని అంటున్నాడు. ధృవ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న చెర్రీ చాలా విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నాడు.

మంచి సినిమాలు చూసేందుకు ప్రేక్షకుడు సినిమా హాలుకు వస్తాడు. కంటెంట్ లేకుండా, పైగా మొత్తం స్క్రీన్ పై నేనే ఉంటే వాళ్లు ఆటోమేటిక్ గా సినిమాను తిరస్కరిస్తారు. గతంలో ఇలాంటి తప్పులే చేశాను. అందుకే ధృవ విషయంలో, అరవింద స్వామి పాత్ర గురించి తాను అస్సలు ఫీల్ కాట్లేదని అంటున్నాడు. ఇండస్ట్రీలో నాని, శర్వానంద్ లను చూస్తే నాకు అసూయ వేస్తుంది. ఎందుకంటే వాళ్లు వైవిధ్యమైన కథలను ఎంచుకుని సక్సెస్ లు కొడుతున్నారు. నాక్కూడా వాళ్లల్లాగా కథలను ఎంచుకోవటం ఎందుకు రావటం లేదన్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ తెలిపాడు చెర్రీ.

ఇక ధృవ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయని హ్యాపీనెస్స్ వ్యక్తం చేసిన చెర్రీ, బీసీ సెంటర్ లలో మాత్రం కలెక్షన్లు వీక్ గా ఉన్నా.. మల్టీఫ్లెక్స్ లలో మాత్రం ఇరగదీస్తోందని తెలిపాడు. నోట్ల రద్దు మాత్రం 30 శాతం ప్రభావం చూపించి ఉండొచ్చన్న అంచనా వేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమా పనులు చూస్కుంటున్న చెర్రీ, అది రిలీజ్ అయ్యాక సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి చెర్రీ మాటలు చూస్తుంటే ప్యూఛర్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండబోతున్నాడని అర్థమౌతోంది కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan Dhruva Interview  jealousy with Nani Sharwanand  

Other Articles