అమీర్ పేటలో రివ్యూ: చిన్న సినిమాకు పాజిటివ్ టాక్ | Ameerpet lo movie gets positive review.

Positive talk for ameerpet lo movie

Ameerpet Lo review, Ameerpet Lo Public talk, Ameerpet Lo telugu movie review, Ameerpet Lo positive reviews, Ameerpet Lo Positive talk, Ameerpet Lo Movie, Ameerpet Lo Good reviews, Ameerpet Lo talk, Ameerpet Lo review

Ameerpet Lo Movie gets good Reviews.

అమీర్ పేటలో కి మంచి స్పందన

Posted: 12/16/2016 01:20 PM IST
Positive talk for ameerpet lo movie

కంటెంట్ బావుంటే టాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారన్నది ఈ యేడాది పెళ్లి చూపులు సినిమాతో మరోసారి గట్టిగా నిరూపించారు. ఈ యేడాది ఓ అరడజను చిత్రాలు కూడా ఇదే రీతిలో విజయం సాధించగా, తాజాగా రిలీజైన అమీర్ పేటలో అనే చిత్రానికి మంచి స్పందన, రివ్యూలు వస్తున్నాయి. శ్రీ, అశ్విని, ఈష‌, రాజు తారగణంలో హీరో శ్రీ నే దర్శకుడిగా మారి తీసిన చిత్రం అమీర్ పేట. పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది.

యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అమీర్ పేట్ ఏరియాను టైటిల్ గా అనౌన్స్ చేసిన దర్శకుడు ఆపై ప్రివ్యూలతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి స్పందనే రాబట్టి కాస్త ఆసక్తి రేకెత్తించారు. ఊళ్ల నుంచి సిటీకి వచ్చిన యూత్ ఎలా బిహేవ్ చేస్తున్నారు. హస్టళ్లలో ఉండే అమ్మాయిల తీరు ఎలా ఉంది. అసలు నేటి యూత్ లక్ష్యాన్ని పక్కనబెట్టి చిన్న చిన్న సంతోషాల కోసం ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు? లైఫ్ లో సీరియస్ విషయాలను ఎలా పక్కనబెడుతున్నారు ఇలాంటి అంశాలను చ‌క్క‌గా ప్రెజంట్ చేశాడు ద‌ర్శ‌కుడు శ్రీ.

ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చిదిద్ది మరోవైపు సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే స‌మాజానికి సంబంధించిన అంశాల‌ను టచ్ చేశాడు. నటీనటులు కూడా చాలా నేచురల్ గా నటించటం విశేషం. మధ్య మధ్యలో అడల్ట్ కామెడీ ఎక్కువైనా, సాగదీసిన సన్నివేశాలు ఉన్నా ఓవరాల్ గా పాజిటివ్ టాక్ నే మూటగట్టుకుంది. దీనికి తోడు నాన్న నేను నా బాయ్ ప్రెండ్స్ సినిమాకు అల్రెడీ బ్యాడ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే పెద్ద సినిమాల డామినేషన్, పైగా నోట్ల రద్దు నేపథ్యంలో సినిమా మున్ముందు ఎలా ఆడుతుందన్నది ఆడియన్స్ చేతిలోనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ameerpet Lo  Movie Review  

Other Articles