విడాకులు వెంటనే.. అఫైర్ లతో దర్శనం | Bollywood actress spot with love affairs.

Actresses is back in love affair after divorce

Bollywood actress, Malaika Arora affair, Karishma Kapoor Affair, karishma Kapoor Affair, Karishma Kapoor Sandeep, Bollywood actress spot with love affairs, Karishma boy friend, Heroines after divorce

Karsihma Kapoor and Malaika arora spot with boyfriends immediate after divorce.

విడాకులయ్యాక పబ్లిక్ గా రెచ్చిపోతున్నారు

Posted: 12/15/2016 12:05 PM IST
Actresses is back in love affair after divorce

విడాకులు ఇలా తీసుకుందో లేదో సామీ రంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పబ్లిక్ గానే చక్కర్లు కొట్టేస్తుంది. ఇది ఎవరి గురించో కాదు. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన కరిష్మా కపూర్ గురించి... కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కరిష్మాకు 13 ఏళ్ల క్రితం వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో వివాహం కావటం, వీరికి ఇద్దరు పిల్లలు ఉండటం తెలిసిందే.

ఆ మధ్య కుటుంబ కలహాలతో అంటూ వీరిద్దరూ విడాకులు తీసేసుకున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయిన వీరి బ్రేకప్ వెనుక కరిష్మ అఫైర్ ఉందన్న వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఆ విషయంలో ఎక్కడా ఆధారాలతో లేకపోవటంతో అంతా సైలెంట్ గా ఉన్నారు. కానీ, అది నిజమేనంటూ పబ్లిక్ గానే చెబుతోంది కరిష్మా.

ముంబైకి చెందిన ఓ ఫార్మాసుటికల్ కంపెనీ సీఈవో సందీప్ తోష్నివల్ తో గత ఆమె డేటింగ్ లో ఉందని, వీరిద్దరు తెగ చక్కర్లు కొడుతున్నారని ఫోటోలతో సహా కథనాలు వస్తున్నాయి. రీసెంట్ గా దర్శకుడు కృష్ణ డీకే పార్టీలో వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావటం, దానికి మరిది సైఫ్ అలీఖాన్(కరీనా భర్త), మరదలు సోహ అలీఖాన్ హజరు అవ్వటం, వీరిద్దరితో అంతా నవ్వుతూ పలకరించటంతో ఈ అఫైర్ ఓపెన్ వ్యవహారమే అని అర్థమౌతోంది.

అంటే పెళ్లి.. అఫైర్.. విడాకులు.. రిలేషన్ ఇలా బాలీవుడ్ లో ప్రస్తుతం సంస్కృతి కొనసాగుతుందన్నమాట. రీసెంట్ గా ఇరవై ఏళ్ల బంధాన్ని చెక్ పెడుతూ ఆర్భాజ్ ఖాన్, మలైకా అరోరాలు విడాకులకు దరఖాస్తు చేయగా, దానికి యువ నటుడు అర్జున్ కపూర్ కారణం అంటూ వార్తలు రావటం తెలిసిందే. మలైకా కూడా ఇప్పుడు అర్జున్ తో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ సందడి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood Actress  Malaika Arora affair  Karishma Kapoor Sandeep  

Other Articles