సింగం-3 వాయిదా, సంక్రాంతికి భలే మజా! | Singam 3 postponed third time.

Singam 3 again postponed

Suriya Singam-3, Singam-3, Singam 3 postponed, Suriya Singam3, Suriya S-3, Vardah Singam-3, S-3 Vardah, Suriya movie postponed

Suriya confirms S-3 postponed. Lkely to release for Sankranti only.

వార్థా ఎఫెక్ట్ : ఎస్-3 పోస్ట్ పోన్

Posted: 12/15/2016 12:55 PM IST
Singam 3 again postponed

అనుకున్నదే జరిగింది. కోలీవుడ్ డిసెంబర్ సెంటిమెంట్ కారణంగా సూర్య సింగం-3 మరోసారి వాయిదా పడింది. దీపావళికే రావాల్సిన ఈ చిత్రాన్ని తమ్ముడు కాష్మోరా కోసం ఓసారి, ఆపై గీతా ఆర్ట్స్ రిక్వెస్ట్ మేరకు ధ్రువ కోసం మరోసారి వాయిదా వేశాడు సూర్య. అయితే ఈసారి ప్రకృతి కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చెప్పేశాడు.

డిసెంబర్ 23న విడుదల కావాల్సిన ఎస్3 వాయిదా వేస్తున్నట్లు తన ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించేశాడు సూర్య. ‘‘ప్రస్తుతం పరిస్థితులు ఏం బాగోలేవు. ఇలాంటి సమయంలో సింగం-3 ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చెప్పలేం. మీ అందరి సహకారం అవసరం’’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పటికే నోట్ల సమస్యతో సతమతమవుతున్న కోలీవుడ్ కి వార్దా కూడా పెద్ద దెబ్బే వేసింది అనుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితిలో ఎస్3ని థియేటర్లలోకి తీసుకురావడం రిస్క్ అని భావించటంతోనే సూర్య అండ్ ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు విశాల్ ఒక్కడొచ్చాడు కూడా ఇదే రీతిలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పట్లో అవకాశం లేకపోవటంతో సంక్రాంతి బరిలోనే సూర్య దిగాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో విజయ్ భైరవాతో పాటు విజయ్ సేతుపతి కొత్త సినిమా ఉండటంతో పోటీ భయంకరంగా ఉండే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singam-3  Vardah effect  Suriya postponed  

Other Articles

Today on Telugu Wishesh