సిగరెట్టే కాదు.. ఇంకా చాలా చాలా చేశాడు | Aamir Khan returns as singer after 18 years.

Aamir khan turns singer for dangal

Aamir Khan Dangal, Dhaakad song, Dangal Dhaakad Song, Dangal Aamir singing, Aamir Khan in Dhaakad Song, Dhaakad Song Aamir Raper, Aamir in Rapper avatar, Dhaakad Video Song, After Gulham now Dangal, Aamir did it after 18 years, Aamir Khan Dangal Song, Aamir Khan Zee lux Golden Awards, Dangal Song at Lux Golden Awards

After Gulham Aamir Khan turns singer after 18 years for Dangal.

18 ఏళ్ల తర్వాత మళ్లీ అమీర్ అదే పని

Posted: 12/13/2016 01:33 PM IST
Aamir khan turns singer for dangal

మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పని చేయబోతున్నాడు. ఏంటనుకుంటున్నారా? తన గొంతు సవరించి ఓ పాట పాడబోతున్నాడండీ. దంగల్ కోసం అమీర్ ఈ ఫీట్ చేశాడంట. చాలా సర్ ప్రైజ్ చివరి నిమిషం దాకా దీనిని సీక్రెట్ గా ఉంచారు లేండి.

18 ఏళ్ల క్రితం గులామ్ సినిమా కోసం ‘‘ఆతి క్యా ఖండాలా’’ అంటూ అమీర్ పాడిన పాట ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు దంగల్ కోసం మరోసారి పాట పాడాడంట. ‘దాఖద్’ అంటూ సాగే ఈ సాంగ్ లో 51 ఏళ్ల అమీర్ ర్యాపర్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చాలా సీక్రెట్ గా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తికాగా, ఇటీవలె నిర్వహించిన లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల కార్యక్రమంలో అల్రెడీ ప్రదర్శించారంట కూడా.

 

అమ్మాయిల దమ్ము గురించి చెబుతూ సాగే ఈ పాటలో చిత్రంలో తన కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యలతో అమీర్ చిందులేయనున్నాడంట. డిసెంబర్ 18న జీటీవీలో ప్రసారం అయ్యే ఈ అవార్డుల పంక్షన్ టెలికాస్ట్ లో ఆ పాటను చూసేయొచ్చు. ఈ కార్యక్రమానికి షారూఖ్, కరణ్ జోహర్ లతోపాటు యువహీరో అర్జున్ కపూర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan's Dangal  Dhaakad Song  Lux Golden Awards 2016  

Other Articles