పవన్ హీరోయిన్ విడాకులకు రెడీ.. భర్తతో అసలు సమస్య ఏంటి? | Reason behind Meera Jasmine divorce.

Meera jasmine headed for divorce

Meera Jasmine Divorce, Malayalam Actress Meera Jasmine, Meera Jasmine Affair, Meera Jasmine Husband, Anil John Titus, Meera Jasmine husband Anil John Titus,

Malayalam actress Meera Jasmine is now ready for Divorce.

మీరా జాస్మిన్ విడాకులకు కారణం లేదా?

Posted: 12/13/2016 12:56 PM IST
Meera jasmine headed for divorce

ఓవైపు సినీ సెలబ్రిటీలు జంటలుగా మారుతుండటం, మరోవైపు ఏళ్ల బంధాన్ని తెంచేసుకుని విడిపోతుండటం రెండూ సమాంతరంగా జరిగిపోతున్నాయి. బాలీవుడ్, సౌత్ఇండస్ట్రీలో ఒకప్పుడే ఇలాంటివి జరిగినప్పటికీ, మధ్యలో కాస్త గ్యాప్ దొరికింది. ఇక ఇప్పుడు వరుసపెట్టి చిన్న చితకా జంటల నుంచి టాప్ సెలబ్రిటీల దాకా ఇదే జరుగుతోంది.

దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్ వైవాహిక బంధం ముక్కలు కావటానికి రెడీగా ఉంది. తెలుగులో కంటే తమిళ, మలయాళం సినిమాల్లో ఎక్కువ పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్... తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజేష్ అనే మ్యుజీషియన్ తో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే, ఆ ప్రేమాయణం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత దుబాయ్ కి చెందిన అనిల్ జాన్  అనే వ్యాపారవేత్తతో అఫైర్ స్టార్ట్ చేసింది. అయితే, అప్పటికే అనిల్ కు పెళ్లయింది. మీరా జాస్మిన్ కోసం తన భార్యకు విడాకులిచ్చాడు. తర్వాత వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న సందర్భంలో మీరాపై అనిల్ భార్య తరపు బంధువులు దాడి చేశారు. అనంతరం, పోలీసుల రక్షణలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

రెండేళ్ల వీరి పెళ్లి బంధానికి అప్పుడే బీటలు వారాయి. విడిపోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏడాది నుంచే తన భర్తకు దూరంగా మీరా ఉంటోందట. విడాకుల కోసం వీరు త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత... సినిమాల్లో మళ్లీ బిజీ కావాలని మీరా భావిస్తోందట. మరి ఫేడవుట్ అయిన మీరాకి ఎవరైనా అవకాశాలు ఇస్తారంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles