15 ఏళ్ల వయసులో లైంగిక దాడి.. ఏం జరిగింది? | Bollywood's Shame moment about Rekha's incident.

Rekha was allegedly molested by actor

Rekha The Untold Story, Book on Rekha, Yaseer Usman Rekha, Biswajeet Chatterjee, Anjana Safar Rekha Moment, Rekha Molested at 15, Rekha Kiss, Last Tango In Paris Rape

About the age of 15, Rekha was purportedly troubled by actor Biswajeet.

రేఖ పుస్తకంలో మరో షాకింగ్ కథనం

Posted: 12/10/2016 04:48 PM IST
Rekha was allegedly molested by actor

సినిమాల్లో కథానుసారం అవసరంను బట్టి లిప్ కిస్సులు, రేప్ సన్నివేశాలు పుట్టుకురావటం సహజం. అలాంటి టైంలో మొహమాటానికి పోకుండా నటీనటులు నటించేస్తుంటారు. కానీ, దాని అలుసుగా తీసుకుని ఆ సన్నివేశాల్లో జీవించేద్దామని యత్నిస్తే ఎలా ఉంటుంది?. నాలుగు దశాబ్దాల క్రితం ‘‘లాస్ట్ టాంగో పారిస్’’ అనే ఓ చిత్రం వచ్చింది. దానికి డైరెక్టర్‌ బెర్నార్డో బెర్తొలూచీ. ఈ చిత్రంలో ఓ పెద్దాయన క్యారెక్టర్ హీరోయిన్ ను రేప్ చేసినట్లు చూపిస్తాడు. అయితే అది రీల్ సన్నివేశం వరకైతే ఫర్వాలేదు. కానీ, అవతలి నటుడిని దర్శకుడు ప్రోత్సహించేసరికి ఆ అమ్మాయిపై ప్రైవేట్ పార్ట్ ను తాకి  నిజంగానే లైంగిక దాడి చేసినంత పని చేశాడంట. బిత్తర పోయిన ఆ అమ్మాయి ఆ షాక్ నుంచి కోలుకున్న ఆ అమ్మాయి ఆపై సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇప్పుడు అలాంటి ఘటనే మరోకటి బయటపడింది. అది కూడా బాలీవుడ్ లో... ఆ అనుభవం ఎదురైంది ఎవరికో కాదు. సీనియర్ నటి రేఖకు. అంజానా సఫర్ అనే చిత్రం రమారమీ ఆ సమయంలోనే వచ్చింది. ఇందులో బిస్వజిత్ ఛటర్జీ, రేఖకు మధ్య ఓ బలవంతపు చుంబనం ఉంటుంది. అయితే ఆ చిత్ర దర్శకుడు రాజా నవాతే ఆదేశానుసారం బిస్వజిత్ రెచ్చిపోయి రేఖపై ఎగబడ్డాడంట. అతని కౌగిట్లో బందించేసి పెదవులను నొక్కేసి, ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా లిప్ లాక్ ఇచ్చేశాడంట.

తనకిచ్చిన స్క్రిప్ట్ లో ఆ సీన్ లేకపోవటంతో అదంతా కావాలనే చేశారని అప్పుడు రేఖకి అర్థమైంది. ఆ పరిణామానికి బిత్తరపోయిన రేఖ అతని వదిలించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. చూస్తున్న వారంత విజిల్స్, క్లాపులతో ఆనదించసాగారంట. అప్పటికీ రేఖ వయసు 15 సంవత్సరాలు. పాపం ఏం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలీక సీన్ అయ్యాక రేఖ వెక్కి వెక్కి ఏడ్చిందట. డైరక్టర్ నికితా దేశ్ పాండే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాగా, రేఖ పేరిట యాసిర్ ఉస్మాన్ రాసిన రేఖ ది అన్ టోల్డ్ స్టోరీ పుస్తకంలో రాసిన పుస్తకంలో ఈ విషయం పేర్కొని ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rekha Molested  Anjana Safar Biswajeet Chatterjee Kiss  

Other Articles