మంచులక్ష్మీని ఇలాగ కూడా వాడేసుకుంటున్నాడా? | Kalanjali new brand ambassador.

Manchu lakshmi brand ambassador for kalanjali

Ramoji Rao Kalanjali, Manchu Lakshmi hoardings, Manchu Lakshmi Kalanjali New Ambassador, Ramoji Rao Ramoji rao, Kalanjali new brand ambassador, Manchu Lakshmi Brand ambassador

Manchu Lakshmi Ramoji Rao's Kalanjali new brand ambassador.

మంచు లక్ష్మీలో ఈ యాంగిల్ ని వాడేసుకుంటున్నారు

Posted: 12/10/2016 03:58 PM IST
Manchu lakshmi brand ambassador for kalanjali

తెలుగునాట రామోజీరావు పేరు గురించి ఎవరికీ తెలియంది కాదు. ఓవైపు మీడియా రంగాలతోపాటు, మరో పక్క మార్గదర్శి చిట్ ఫండ్స్, కళాంజలి, ప్రియా పచ్చళ్లు లాంటి బిజినెస్ లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. వీటికి తోడు రామోజీ ఫిల్మ్ సిటీ అనే జెయింట్ దిగ్గజం తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. అయితే వీటన్ని ప్రచారం కోసం ఆయన పెద్దగా శ్రమ పడడు. చాలా సాదాసీదాగా బ్రాండ్ లను ప్రచారం చేసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి.

వస్త్ర రంగంలో కళాంజలికి మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా పోటీగా ఉన్న సంస్థలు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లతో లాంఛ్ లు చేయించటం, ఓపెనింగ్ లలో హడావుడి లాంటివి కనబడుతుంటాయి. కానీ, రామోజీ రావుకి అలాంటివి సుతరాము ఇష్టం ఉండదు. చివరకు తన సీరియల్స్ లో నటించేవారిని కూడా అందుకు ఉపయోగించడు. సింపుల్ గా తన ఫ్యామిలీ చేతుల మీదుగా, అవసరమనుకుంటే కొందరు సెలబ్రిటీలను ఆహ్వానించి కానిచేస్తుంటాడు. ఆ మధ్య శృతీహాసన్ ను మాత్రమే ఈ బ్రాండ్ కోసం ఫోటోషూట్ కి వాడేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ మంచు లక్ష్మీతో ఆ పని చేయిస్తున్నాడు.

ప్రస్తుతం కళాంజలికి బ్రాండ్ అంబాసిడర్ మంచు లక్ష్మీ. త్వరలో బ్రహ్మోత్సవం పేరిట నిర్వహించబోయే మేళాకు మంచు లక్ష్మీతో ఫోటో షూట్ లు చేయించి వదిలాడు రామోజీరావు. తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ సెంటర్ లలో ప్రస్తుతం ఈ హోర్డింగ్ లు కనిపించి ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క మార్గదర్శి గ్రూప్ కోసం ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని ఆయనతో ప్రచారం చేయిస్తున్న సంగతి తెలిసిందే.

Kalanjali new brand ambassador

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi Kalanjali  New Brand Ambassador  

Other Articles