రిలీజ్ కు ముందే ఓ రికార్డు కన్ఫర్మ్ అయ్యింది | Ram Charan dream fulfilled.

Ram charan dhruva record overseas business

Ram Charan, Dhruva Movie, Dhruva Overseas, Dhruva million dollar dream, cherry million dollar dream, Dhruva US theaters, Dhruva overseas record

Ram Charan Dhruva Overseas business record fulfilled.

ధ్రువ కాంసంట్రేషన్ అంతా అక్కడే...

Posted: 12/02/2016 12:00 PM IST
Ram charan dhruva record overseas business

రాం చరణ్ ధ్రువ కౌంట్ డౌన్ ఇంకా వారం మాత్రమే ఉంది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తని ఒరువన్ రీమేక్ కావటం, పైగా చెర్రీ కెరీర్ లోనే భారీగా బిజినెస్ చేసిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయంలో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వటం లేదు. తానే స్వయంగా దగ్గరుండి మరీ పనులు చూసుకుంటున్నాడు. ఎడిటింగ్ రూంలోకి కూడా ఎవరినీ రానివ్వటం లేదంట.

ఇక రామ్ చరణ్ కు తొలి నుంచి ఓవర్ సీస్ బిజినెస్ వైజ్ పెద్ద ప్రోత్సాహకరంగా ఉండటం లేదు. ఒక 'మగధీర' మినహా చరణ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్కడ పెద్దగా కలెక్షన్స్ ఉండటం లేదు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా అక్కడ అంతంత మాత్రంగానే అడుతున్నాయి. చిన్న, మీడియం తరహా హీరోలు కూడా మిలియన్ మార్క్ ను ఈజీగా క్రాస్ చేసేస్తుంటే చరణ్ ఇప్పటికీ ఆ రికార్డును అందుకోకపోవటం ఆశ్చర్యమే. అందుకే 'ధృవ' కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మేకోవర్ దగ్గర్నుంచి ప్రమోషన్ల వరకూ అన్నింటి మీదా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఓవర్సీస్ పబ్లిసిటీ విషయంలో మరీ ఎక్కువ శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం.

రికార్డు స్థాయిలో ఒక్క యూఎస్ లోనే 200లకు పైగా స్క్రీన్లలో ధ్రువ రిలీజ్ కాబోతుంది. దీంతో మిలియన్ డాలర్ డ్రీమ్ నెరవేరినట్లే అనుకోవచ్చు. మూవీ ప్రీ రిలీజ్ వేడుక కూడా డిసెంబర్ 4న నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ సినిమా చెర్రీ కెరీర్ లో సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచిపోవటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Movie  Overseas record  

Other Articles