సమంత ఫన్నీ ట్వీట్ తో చిక్కుల్లో పడ్డ కుర్రాడు | Samantha Funny tweet troubles Music Director.

Samantha about anirudh engagement

Anirudh Ravichandran, Samanatha, Anirudh Ravichandran Engagement, Anirudh Ravichandran Gossip, Samantha Anirudh Ravichandran, Anirudh Ravichandran funny tweet, Samantha Funny Tweet

Samantha Funny Re Tweet Troubles Music Director Anirudh Ravichandran.

ఎంగేజ్ మెంట్ తో ఇరికించేసిన సమంత

Posted: 11/23/2016 10:39 AM IST
Samantha about anirudh engagement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఇండస్ట్రీలో చాలా మందితో క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుంది. వారిలో యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ఒకడు. కొలవెరి పాటతో బాగా పాపులర్ అయిన ఈ కుర్రాడు ఆ మధ్య తనకన్నా వయసులో పెద్దదైన సింగర్ కమ్ నటి ఆండ్రియాతో ప్రేమ వ్యవహారం నడపటమేకాదు, ఏకంగా లిప్ లాక్ ఫోటోలను పబ్లిక్ గా పెట్టేసి హైలెట్ అయ్యాడు కూడా. ఆ తర్వాత బ్రేకప్ కావటం, ప్రస్తుతం ఒంటరి జీవితం గడపటం తెలిసిందే.

గత నాలుగు రోజులుగా కోలీవుడ్ మీడియాలో అనిరుధ్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్ పై వార్తల మీద వార్తలు వచ్చేస్తున్నాయి. దీంతో స్పందించిన అనిరుధ్ తానింక సింగిల్ గానే ఉన్నానంటూ ఓ ట్వీట్ వేశాడు. మరి సమంత ఊరుకుంటుందా చెప్పండి? వెంటనే ఎందుకలా అంటావ్.. ‘తను మంచి అమ్మాయే కదా! షి ఈజ్ ఎ స్వీట్ గాళ్. ఏమైంది? అని రీ ట్వీట్ చేసింది. అంతే దెబ్బకి యవ్వారం పెద్ద దుమారం రేపింది. సమంత ఎలాగో అనిరుధ్ కి కాస్త క్లోజ్ కాబట్టి ఖచ్ఛితంగా ఆ వార్త నిజమై ఉంటుందని అంతా డిసైడ్ అయిపోయారు.

చివరికి అనిరుధ్ పేరెంట్స్ సీన్ లోకి ఎంటర్ అయితేనేగానీ అదంతా ఉత్తదేనని మీడియా కూడా నమ్మలేకపోయింది. అంతలా ఇరకించిందన్నమాట సామ్. అన్నట్లు అనిరుధ్ ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందించేందుకు సిద్ధమైపోతున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Anirudh Ravichandran  Secret Engagement  

Other Articles