నోట్లు మారిస్తే సినిమా కష్టాలు కూడా ఉంటాయండి... | stars including Amithabh and Rajanikanth prised modi's currency decision.

Amitabh bachchan and rajanikanth hails modi on currency decision

Big B Rajanikanth and Modi, Rajanikanth and Modi, Celebrities on Currency exchange, Tollywood on Modi's Notes Ban, Star Hero's reaction on Modi's Note Exchange program

Cine Celebrities Amithabh Bachchan and Rajanikanth praised Narendra Modi for Ban 500 and 1000 notes.

మోదీ నిర్ణయంపై స్టార్ల రియాక్షన్

Posted: 11/09/2016 10:31 AM IST
Amitabh bachchan and rajanikanth hails modi on currency decision

ఓవైపు అమెరికా ఎన్నికల కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ, ఇండియాతోసహా అన్ని దేశాలు దిగ్భ్రాంతి చెందేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నోట్ల అనౌన్స్ మెంట్ చేసేశాడు. నల్ల ధనం నియంత్రణ జరుగుతున్నందుకు ఓవైపు సంతోషంగా ఉన్నప్పటికీ, కొంత కాలం సామాన్యులకు చుక్కలు కనిపించటం మాత్రం ఖాయం. ఈ దశలో మరి సెలబ్రిటీలు ఎలా స్పందిస్తున్నారో చూద్దామా?

ముందుగా బాలీవుడ్ బిగ్ బీ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేశాడో చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా విడుదల చేయనున్న రెండు వేల రూపాయల కొత్త నోట్ కలర్ ‘పింక్’ అని.. అది తాను నటించిన ‘పింక్’ సినిమా ఎఫెక్టు అంటూ బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు.

మోదీకి జేజేలు. నవీన భారతం ఆవిర్భవించింది. జై హింద్ అంటూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రశంసించాడు.

 

 

దర్శకనిర్మాత మధుర్ భండార్కర్: మోదీకి అభినందనలు. ఆయన నిర్ణయంతో నల్లధనం వెలికి వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ప్రధాని నిర్ణయంతో రూ. 500, రూ. 1000 నోట్లు బయటపడక తప్పదు. నల్లధనం దాచిన వారు వెలుగులోకి వస్తారంటూ సీనియర్ నటుడు పరేష్ రావల్ పేర్కొన్నాడు.

ఈ మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ బోనీకపూర్ కొడుకు, హీరో అర్జున్ కపూర్ ట్వీటాడు.

ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 9/11 రోజున కొంత మంది ఓడిపోతారు... కానీ, ఎంతో మంది గెలుస్తారంటూ నటుడు సునీల్ శెట్టి తెలిపాడు.

ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలంటూ హీరోయిన్ అనుష్కశర్మ చెప్పింది.

అమెరికాలో ఓట్లు లెక్కిస్తుంటే.. ఇండియాలో నోట్లు లెక్కిస్తున్నారు. నోట్ అంటూ గుడ్ నైట్ చెప్పింది సోనాక్షిసిన్హా.

ప్రధాని మోదీ కొట్టిన బంతి స్టేడియం అవతల పడిందంటూ దర్శకనిర్మాత కరణ్ జోహర్ పేర్కొన్నాడు.

 

మరోపక్క టాలీవుడ్, కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా మోదీ తీసుకున్న డెసిషన్ పై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ పెద్ద నోట్లతో చిక్కులు ఎదుర్కునే విషయంలో టాలీవుడ్ ను కూడా మినహాయించలేం. ఎందుకంటే ఇండస్ట్రీలో రోజువారి సెటిల్మెంట్స్ క్యాష్ గానే జరుగుతుంటాయి. కార్మికుల వేతనాలు ఎక్కువగా నగదు రూపంలోనే పేమెంట్స్ అవుతూ ఉంటాయి. ఇదే అతి పెద్ద సమస్యగా పరిణమించే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో బ్లాక్ మనీతో సినిమాలు తీస్తున్నారనే మాటలు కూడా చాలా రోజులుగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు 500.. 1000 నోట్లే చెల్లవని చెప్పేయడంతో వీటిని తీసుకునేందుకు ఎవరూ సాహసించరు. దీంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అనేక పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Movie Celebrities  reaction  PM Modi  Currency exchange  

Other Articles