బాలీవుడ్ లో టాప్ స్టార్ల వారసులు చేసే ఫీట్లను చూసి విమర్శించే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. ఎవరైనా సినిమాల కోసం ఫోటో అడిషన్లు చేయటం ఆపై వాటిని నిర్మాతలకు పంపటం లాంటివి చేస్తుంటారు. కుదరలేదంటే ముందు మోడలింగ్ ఆపై, మాగ్జైన్ల ద్వారా మేకర్ల కంట్లో పడి ఛాన్సులు దక్కించుకుంటారు. కానీ, ఇప్పుడు టోటల్ గా ఆ ట్రెండే మారిపోయింది. తమకున్న నెట్ వర్క్ లు... అదేనండీ ఫేస్ బుక్, ట్వట్టర్, ఇన్ స్టాగ్రామ్ లను వాడేసుకుంటున్నారు. అయితే ఆ వాడకం మాములుగా ఉండటం లేదు. రెచ్చిపోయి కవ్వించే ఫోటోలతో నింపేస్తున్నారు.
వెరిసి హాట్ టాపిక్ గా మారటమే కాదు, అవకాశాల బరిలో నిలుస్తున్నారు. ఇంకోవైపు సినిమాల్లోకి రాకముందే స్టార్ సెలబ్రిటీల వారసులు లవ్ బర్డ్స్ గా కూడా బాగానే పాపులర్ అవుతున్నారు. పట్టుమని 20ఏళ్ళు కూడా పూర్తి కాక ముందే బోయ్ ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేయడం చర్చనీయాంశమవుతోంది. అలాంటి వారిలో కొందరు మాణిక్యాల గురించి...
అలియా ఇబ్రహీం బేడీ:
బాలీవుడ్ నటి పూజా బేడీ డియరెస్ట్ డాటర్. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం బాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ అప్పుడప్పుడే కాస్త పెరిగిపోతున్న సమయంలో ఏకంగా ఓ కండోమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా పనిచేసి యాడ్ లో కూడా ఇరగదీసింది పూజాబేడీ. మరి అలాంటి బోల్డ్ వుమెన్ కి పుట్టిన డాటర్ ఇంకెలా ఉంటుంది చెప్పంది. టీనేజీలో ఉన్న అలియా ఇబ్రహీం హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. ఎంతలా యాభై ఏళ్ల తల్లితో కలిసి పీలికల్లా ఉండే పొగులు వేసుకుని మీర ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుండేంతలా.
అయితే ఈ మధ్య యవ్వారం శృతి మించిపోవటంతో అలియాపై బూతు పురాణం అందుకున్నారు కొందరు. ఛాన్స్ ఇస్తే పోర్న్ సినిమాల్లో కూడా నటించేలా ఉన్నావే అంటూ కామెంట్లు చేశారు. కానీ, తను మాత్రం చాలా కూల్ గా స్పందించింది. బాలీవుడ్ లో ప్రస్తుతం బికినీలు ట్రెండ్ గా మారాయి. అలాంటప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా వేసుకుని వెండితెరలపై సందడి చేస్తున్నారు. అలాంటప్పుడు వారు చేసేవి కూడా పోర్న్ సినిమాలు అయిపోతాయా? మైండ్ సెట్ మార్చుకోండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.
కృష్ణా ష్రాఫ్:
అందాలను ఒలకబోస్తూ బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోన్న తన ఫొటోలకి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. బికినీలతో అదిరే లుక్స్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేస్తోన్న ఫొటోలకు తన ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం టాప్‌లెస్ ఫొటో, తాజాగా బికినీలో ఫొటోలను ఈ భామ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉంచింది. 'టూ పీస్ బికినీతో ఫొటోలోని అమ్మాయి రాత్రి సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్నట్లు ఉంది కదా?' అంటూ, 'మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలంటూ' ఆ అమ్మడు సోషల్‌మీడియాలో తన ఫొటోను గురించి పేర్కొంది.
ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇప్పుడు లక్షా 85 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కృష్ణా ష్రాఫ్ సోదరుడు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్‌లోకి ఇప్పటికే ప్రవేశించాడు. ఆయనలాగే ఇప్పుడు ఈమె కూడా సినీరంగంలోకి ప్రవేశించాలని అనుకుంటోందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫొటోలపై స్పందించిన ఆమె తండ్రి జాకీ ష్రాఫ్... తాను ఈ అంశంలో జోక్యం చేసుకోనని వ్యాఖ్యానించారు. తన కొడుకు, కూతురు టైగర్, కృష్ణా ఇద్దరూ తెలివైనవారని చెప్పిన ఆయన, వారు ఏం చేయాలో వారికి తెలిసిపోయిందని అన్నారు. ఈ విషయంలో తనకు అభ్యంతరం లేదని చెప్పాడు.
జాన్వీ కపూర్:
80, 90 లలో ఇండియాను షేక్ చేసిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు దీనికి మినహయింపు కాదు. గత కొన్నాళ్ళుగా శ్రీదేవి కూతురు వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వచ్చాయి. సినిమాలలోకి రాకపోయిన ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం తక్కువ లేదు. పార్టీలు, పబ్ కల్చర్‌ని బాగా వంట బట్టించుకున్న జాన్వీ కపూర్ ని చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఆ మధ్య ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి లిప్ లాక్ చేస్తోండగా, కెమెరాకు చిక్కింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఈ ఫోటోలో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఆ లవ్బర్డ్స్ని చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ .. సారా అలీఖాన్ బాయ్ ఫ్రెండ్ వీర్ పహరియా సోదరుడు అని తెలుస్తోంది.
సారా అలీఖాన్:
బాలీవుడ్ ఖాన్ త్రయం కాకుండా ఉన్న మరో ఖాన్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురే సారా అలీఖాన్. సీనియర్ పొలిటికల్ లీడర్ సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో డేటింగ్ లో మునిగి తేలుతోందంటూ ఆ మధ్య బాలీవుడ్ లో హాట్ న్యూస్ హడావుడి చేయగా, తర్వాత పార్టీలు, బికినీలు అంటూ హడావుడి చేసింది తెలిసిందే.
సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె అయిన సారా ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఇంకా తేరంగ్రేటం చేయకుండానే ఈ పాప కూడా ఇలా డేటింగ్ లతో, పార్టీలకు హాట్ లుక్స్ తో వచ్చి మీడియాకు మ్యాటర్ గా మారిపోతుంది.
సుహానా ఖాన్ :
ఈ అమ్మాయికి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె తండ్రి బాలీవుడ్ ను ఏలే బాద్ షా కాబట్టి. షారూఖ్ ఖాన్ ముద్దుల తనయ అయిన సుహానా ఇప్పుడు చాలా ఎదిగిపోయింది. ఎంతలా అంటే బికినీలు వేసి సిగ్గుపడే స్థాయికి ఆ మధ్య ఆ ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి లేండి. ఇక పతండ్రి బాలీవుడ్ బాద్ షా కుమార్తె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ముచ్చటపడుతోందట. ముచ్చపడితే సరిపోదు కదా… ఈ అమ్మాయి గురించి పట్టించుకునే వారు కూడా కావాలి కదా. అందుకే ఈ అమ్మాయి కసరత్తులు మొదలుపెట్టింది.
మీడియా దృష్టిలో పడటానికి తనదైన స్కెచ్ వేయడానికి రెఢీ అవుతోంది. అప్పుడు బీచ్‌లో పార్టీ చేసుకున్న ఫోటోలు ఇప్పుడేమో తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోలు సుహానా పెద్దది అయిపోయిందనటానికి నిదర్శనాలు. డ్రెస్సింగే కదా.. తండ్రికి డ్యాన్స్ అంటే ప్రాణం కదా. అందుకే డాన్సర్ అయ్యేందుకు రెఢీ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతో తన అందాలను ఆరబోస్తోంది. తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా తన మనసులోని మాటను చెప్పేస్తోంది.
ఇందుకు తన తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆమె తెగ ముచ్చట పడిపోతోంది కూడా. మరోవైపు షారూఖ్ ఏమో తన కూతురిని ఎవరైనా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే చీరేస్తా అంటు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అన్నింటికి తెగించాలన్న విషయం కింగ్ ఖాన్ కి తెలీదంటారా? చెప్పండి.
ఇలా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సోషల్ మీడియాలో తమ అందాలు, అఫైర్లతో నిత్యం జనాల నోళ్లలో నానుతూ న్యూసెన్స్ లతో న్యూస్ గా మారిపోతున్నారీ ఈ నట వారుసులు. వీరే కాదు అమితాబ్ మనవరాలు(కూతురు శ్వేతా నంద కూతురు) నవ్యా నవేలి, సంజయ్ దత్ కూతురు త్రిశల దత్, కమల్ కూతురు శృతీహాసన్, క్రికెటర్ లెజెండ్ సచిన్ కూతురు సచిన్ కూతురు సారా టెండూల్కర్ లాంటి వాళ్లు కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
వీరే కాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అలియా భట్, సోనాక్షి సిన్హా, సోనం కపూర్ లాంటి వాళ్లు కూడా స్టార్ల సంచలనాల బిడ్డలే. అయితే మరి కెరీర్ ని ఇంకా ప్రారంభించకుండానే ఇలా రచ్చరంబోలా చేస్తే ఫ్యూచర్ లేకుండా పోతారంటూ క్రిటిక్స్ సలహా ఇస్తున్నారు. మరి ఈ మంచి మాటలను ఎవరైనా చెవికి ఎక్కించుకుంటారంటారా? అయినా వారి పెరెంట్స్ కే లేనిది మనకెందుకు లేండి...
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more