వ్యభిచారంలో అరెస్టయ్యిందనగానే... బూతు మెసేజ్ లు పంపారంట | Malayalam actor gets abusive messages after actor same name arrested sex work

Same name troubles this kerala serial actress

Amala rose kurian Facebook Post, Amala rose kurian not in Sex Racket, Malayalam Serial Actress Caught in Sex Racket, Serial Actress in Sex racket, actress clarify about sex racket, Serial Actress Amala rose kurian, Vulgar Messages to Serial Actress, Amala rose kurian Facebook

Popular Serial Actress Amala rose kurian clarifies that She was not arrested in Thodupuzha Sex Racket.

వ్యభిచారం చేసింది ఆ అమల కాదంట!

Posted: 11/08/2016 12:49 PM IST
Same name troubles this kerala serial actress

ఇలాంటి వ్యవహారాల్లో మీడియా చేసే మిస్టేక్ లతో స్టార్ హీరోయిన్లు చిక్కులు ఎదుర్కున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. పేరు ఒకేలా ఉన్నంత మాత్రానా అందులో పట్టుబడింది స్టార్ నటేనని వార్తలు రేపటం, ఆపై వారు ముఖం చూపించుకోలేక సోషల్ మీడియాలో తాను కాదు ముర్రో అంటూ ప్రకటించేసుకోవటం మనం చూశాం కూడా. గతంలో శ్రీదివ్య అనే పేరుతో ఓ జూనియర్ ఆర్టిస్ట్ పట్టుబడితే బస్ స్టాప్ ఫేం, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన అయిన శ్రీదివ్యే అంటూ గగ్గోలు పెట్టేశారు కొందరు. ఆపై అది తాను కాదంటూ ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి పరిస్థితి దాపురించింది.

ఇక ఇప్పుడు మరో నటి విషయంలో కూడా ఇలానే జరిగింది. కేరళలోని తోడుపుఝా లో అక్టోబర్ చివరి వారంలో ఓ నటిని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె పేరు అమలా సీరియల్స్ లో రోల్స్ చేస్తుందని వార్త బయటికి వచ్చింది. అయితే ఆ అమలను ప్రస్తుతం అక్కడ సీరియల్స్ లో హీరోయిన్ రోల్స్ పోషించే యంగ్ హీరోయిన్ అమలా రోజ్ కురియన్ అనుకుని పొరపడిన మీడియా, వెబ్ సైట్లు ఆమె ఫోటోలతో వార్తలను, కథనాలను పబ్లిష్ చేసేశాయి.

దీంతో చిర్రెత్తుకొచ్చిన అమల కాస్త విభిన్నంగా  స్పందించింది. ‘‘మీకు అమలా రోజ్ కురియన్ సూసైడ్ చేసుకుంటే చూడాలని ఉందా? ఇలాంటి వార్తనే వినాలని మీరు కోరుకుంటున్నారా? నేనోక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నటించటమే నా ప్రవృత్తి అందుకే ఇండస్ట్రీలో ఉన్నాను. మీరు చేసిన పొరపాటు వల్ల వారం నుంచి నాకు నిద్ర లేదు. బంధువులు, స్నేహితులు అంతా ఫోన్లతో పరువు తీస్తున్నారు. అంతేకాదు కొందరు వాట్సాఫ్ లో అసభ్య సందేశాలను కూడా పంపుతున్నారు.

తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకుంటుంటే... ఏ తప్పు చేయని నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. చివరగా నేను చెప్పేది ఒక్కటే... తప్పుడు వార్తలతో వచ్చే కథనాలను నమ్మకండి అంటూ సోషల్ మీడియాలో ఉండేవారందరికీ విజ్నప్తి చేస్తున్నాను’’ అంటూ ఓ సందేశాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది అమల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serial Actress  Amala rose kurian  Sex Racket Arrest  Facebook Post  

Other Articles