అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డు వచ్చేసిందోచ్ | akhil akkineni engagement card released

Akhil akkineni engagement card released

akhil akkineni engagement invitation card, akhil shriya engagement card, akhil engagement card fake, akhil marriage date fix, december 9th akhil, akhil engagement details

akhil akkineni engagement invitation card released.

అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డు వచ్చేసింది

Posted: 11/01/2016 09:35 PM IST
Akhil akkineni engagement card released

అక్కినేని ఇంట వచ్చే ఏడాది పెళ్లి బాజాలు మోగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద కొడుకు చైతూ కన్నా ముందే అఖిల్ కు మూడు ముళ్లు వేయించేయాలని నాగ్ ఆలోచన అని ఇదివరకే చెప్పుకున్నాం. ఈ దశలో డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ అని గతంలో వార్తలు రాగా, సమ్మర్ లో ఇటలీలో పెళ్లంటూ ఈ ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతలో ఎంగేజ్ మెంట్ కార్డు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

యువహీరో అఖిల్ అక్కినేని, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్సయింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ఆ కార్డు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో డిసెంబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఈ వేడుక జరగనున్నట్లు ఎంగేజ్ మెంట్ కార్డులో పేర్కొన్నారు.

కాగా, అఖిల్, శ్రియాభూపాల్ ప్రేమ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. తమ ప్రేమ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడం, అందుకు వారు అంగీకరించడం తెలిసిందే. ఇక, సినీ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతల వివాహం ఎప్పుడు జరుగుతుందా అని కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni akhil  engagement card  shriya bhupal  

Other Articles