ఆ సెల్ఫీ తీసింది పవర్ స్టారేనా? | fan tricky photoshop pawan in diwali selfie

Fan tricky photography pawan in diwali selfie

Pawan in Mega selfie, Pawan kalyan Mega family selfie, Pawan fans revenge on bunny, pawan in mega selfie, pawan click mega family selfie, Mega selfie on Diwali

With Fan tricky photo edit Pawan also in Mega Diwali selfie, Allu brothers exited.

మెగా దీపావళి సెల్ఫీ తీసింది పవనేనా?

Posted: 11/01/2016 04:56 PM IST
Fan tricky photography pawan in diwali selfie

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోలో మెగా స్టార్ పవర్ స్టార్ లు ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆపై ఆ ఇద్దరూ ఎక్కడా కలుసుకునే అవకాశం రాలేదు. చిరు లాగా పవన్ కూడా అన్నయ్య 150 సెట్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే దీపావళి రోజున ఓ మెగా సెల్ఫీ బాగా సందడి చేసింది. బ్రదర్స్ చిరంజీవి.. నాగబాబు, వారసులు నీహారిక, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సాయిధరమ్ తేజ్, అల్లుళ్లు అల్లు అర్జున్, శిరీష్ తో కలిసి ఒక ఫొటో దిగారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రమైన ‘ఖైదీ నంబర్ 150’ ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ తన అభిమానులతో పంచుకున్నాడు. ‘అన్నయ్య కుటుంబం ‘మెగా కింగ్ డమ్’ మెగా వారసులు.. మెగా ఫ్యామిలీ’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేడుగా మరి అభిమానులు ఊరుకుంటారా చెప్పండి?

pawan also in diwali selfie

తాజాగా, ఈ ఫొటోను పవన్ అభిమాని ఒకరు ఎడిట్ చేశాడు. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ కూడా ఉంటాడు. అయితే ఈ మధ్య కాస్త నెగటివ్ కామెంట్లు చేస్తున్న బన్నీని, అతని సోదరుడిని ఫోటోలోంచి లేపేసి మరీ పవన్ ను ఎడిట్ చేశాడు ఆ వ్యక్తి. ఆ ఫొటోను ‘పవనిజమ్’ఫేష్ బుక్, ట్విట్లర్ పేజీల్లో షేర్ చేయగా, అది ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అలా పవన్ పై అభిమానం చూపటమే కాదు, బన్నీపై రివెంజ్ కూడా తీర్చుకున్నారు ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega family  Diwali selfie  Pawan edited  

Other Articles