నాయకి ఏకంగా జయలలిత పదవికే ఎర్త్ పెడుతోంది. | Trisha wants to be the CM

Trisha interested in jayalalitha s biopic

Trisha wants to be the CM, CM trisha, Trisha turns Amma, Trisha jayalalitha, Trisha in Jayalalitha's Biopic, Trisha Kayalalitha Movie, Nayaki wants Amma, Trisha wants CM

Actress Trisha interested in Tamil Nadu CM Jayalalitha's Biopic.

జయలలిత బయోపిక్ లో త్రిష?

Posted: 10/28/2016 08:27 AM IST
Trisha interested in jayalalitha s biopic

ఇండస్ట్రీకి పదిహేనుళ్లు అయ్యింది కదా సో... త్రిష సీనియర్ హీరోయిన్ అనే అనుకోక తప్పదు. మిస్ చెన్నైగా ప్రారంభమైన ఈ డస్కీ బ్యూటీ ప్రస్థానం ఆపై హీరోయిన్ గా తమిళ్, తెలుగు చలనచిత్రాల్లో దశాబ్దం పాటు హవా కొనసాగించింది. ప్రస్తుతం కాస్త వెనుకబడినప్పటికీ, మెచ్యూర్ ఉన్న పాత్రలు ఆమెను వరిస్తుండటంతో రిటైర్ మెంట్ గ్రాండ్ గానే ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ సరసన నటించిన కోడి(తెలుగులో ధర్మయోగి) తో ఆమె ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుంది.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ తన మనసులో మాట వెల్లడించింది త్రిష. కోడి సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం బయోగ్రఫీల యుగం నడుస్తోందని, బాలీవుడ్ లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి, మంచి విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని తెలిపింది. అంతేగానీ, రాజకీయ ఆరంగ్రేటం కాదు సుమీ!

సీఎం జయలలిత బయోపిక్ లో నటిస్తే ఆ కోరిక తీరుతుంది కదా... అలా అన్నమాట. తామిద్దరం(జయలలిత-త్రిష) ఒకే స్కూల్ (చర్చ్ పార్క్) లో చదువుకున్నామని, ఆమె జీవితం స్పూర్తివంతంగా ఉందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని త్రిష తెలిపింది. అంతేకాదు ఆ మధ్య జయలలిత నుంచి అవార్డు అందుకున్న త్రిష దానిని లైఫ్ టైం పురస్కారంగా అపురూపంగా దాచుకుందంట. మొత్తానికి అనారోగ్యంతో అమ్మ వార్తల్లో హైలెట్ గా నిలిస్తే.. ఆ బయోపిక్ పేరు చెప్పి త్రిష ఇలా నానుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Jayalalitha's biopic  

Other Articles