మాట్లాడుతుండగానే కార్తీది ఊడిపోయింది... పరువు పోయింది | Hero Karthi Fake Mustache Gone At Kashmora Movie Pressmeet

Hero karthi fake mustache gone

Hero Karthi Fake Mustache, Karthi Fake Mustache, Hero Karthi's Fake mustache slip, Karthi's speech at Kasmora Press meet, Karthi Fake Mustache, Fake Mustache slip

Hero Karthi Fake Mustache Gone At Kashmora Movie Pressmeet.

ఫన్నీ: ప్రమోషన్ కోసం వస్తే పరువు పోయింది

Posted: 10/27/2016 05:25 PM IST
Hero karthi fake mustache gone

మన మీడియా చాలా షార్ప్ అన్న సంగతి మరిచి కూడా హీరోహీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ లొసుగులతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా హీరో కార్తీకి కూడా ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. తాను నటించిన కాష్మోరా సినిమా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మరి మన దగ్గర ప్రమోషన్ చాలా అవసరం కదా. అందుకని హైదరాబాద్ వచ్చిన మనోడు ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఓ అఫీషియల్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

అక్కడే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ల గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా మీసం కిందకు జారింది. అది గమనించకుండా కార్తీ మాట్లాడుతూనే వెళ్లాడు. అది కాస్త సగం ఊడి నోటికి అడ్డంగా పడటంతో అప్పుడు దానిని సరి చేసుకుని స్పీచ్ ను కంటిన్యూ చేశాడు.

సాధారణంగా బాలీవుడ్ లో మీసాలు లేని ట్రెండ్ ను బాగా ఫాలో అవుతుంటారు. మన దగ్గర మీసాలు కంపల్సరీ అయినప్పటికీ, ఒక్కోసారి ప్రయోగాల కోసం వాటిని తీసేయాల్సి ఉంటుంది. అలాంటిది ప్రేక్షకుడు పెద్ద మనసుతో ఆ హీరోను అంగీకరిస్తుంటాడు. అలాంటిది అవసరం లేకపోయినా ఇలా ప్రెస్ మీట్ కి పెట్టుడు మీసాలతో వచ్చిన కార్తీ, పోయి పోయి మన మీడియా కంట్లోనే పడి ఇప్పుడు బాగా నానుతున్నాడు. పోనీలెండి ఇది కూడా ఒక రకంగా కాష్మోరా ప్రమోషన్ కి పనికొస్తే అంతే చాలూ. అన్నట్లు కాష్మోరా రేపే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Kashmora pressmeet  Fake Mustache  

Other Articles