రణ్ వీర్ సింగ్ తో బ్రేకప్ గురించి దీపికా | Deepika Padukone talks about alleged break-up with Ranveer

Deepika about break up with ranveer singh

Deepika Padukone break-up with Ranveer Singh, Deepika Padukone talks about break-up with Ranveer, Deepika Ranveer Singh break up, speculations on Deepika Ranveer break up

Deepika Padukone FINALLY talks about her alleged break-up with Ranveer Singh.

బ్రేకప్ స్పందించిన బాలీవుడ్ బ్యూటీ

Posted: 10/27/2016 01:48 PM IST
Deepika about break up with ranveer singh

సినిమా కోసం కలుసుకోవటం, ఓ ఆరేడు నెలలు డేటింగ్ పేరిట తెగ తిరిగేయటం, ఆపై మూట ముళ్లే సర్దుకుని ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోవటం, ఆపై ఇంకో కొత్త జతను చూసేసుకోవటం... ఇది బాలీవుడ్ లో ఓ చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. కానీ, దాదాపు మూడు నాలుగేళ్లుగా జంటగా ఉన్న రణ్ వీర్ సింగ్-దీపిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకటయి తీరుతారన్న గట్టి నమ్మకం చూసే ప్రతీవారిలో నాటుకుపోయింది. కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా!

బేఫికర్ రేపిన చిచ్చుతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిందని, పైగా హాలీవుడ్ వెళ్లాక పొగరు నెత్తికి చేరి దీపిక రణ్ వీర్ ను పట్టించుకోవటం మానేసిందని, కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో దీపిక ఉందని... ఇలా వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు రణ్ వీర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి విషాద ఫిలాసఫీలను చెప్పుకోచ్చాడు. అలాంటప్పుడు వీరిద్దరు విడిపోయారనే వార్తను ఎవరైనా ఎలా నమ్మకుండా ఉంటారా చెప్పండి?.

ఇదే విషయమై మీడియాకు చిక్కిన దీపిక ఏమంటుందో చూడండి. మేము బ్రేకప్ అయ్యాం అంటే మీరంతా ఎలా నోళ్లు వెళ్లబెట్టారో... ఆ వార్త(పుకారు) తెలిశాక మేము అంతే షాక్ కి గురయ్యాం. ఇలాంటి వాటితో ఎవరికీ ఏం ఆనందం వస్తుందో అర్థం కావటం లేదు. ఆ షాకింగ్ వార్త అస్సలు నిజం కాకుడదంటూ నేను, రణ్ వీర్ దేవుడిని ప్రార్థించాం కూడా. ఏదైనా ఒక పర్సనల్ వ్యవహారం అందరికీ తెలిస్తే చాలూ... ఇక దానికి సంబంధించిన తోకలు పట్టుకుని వార్తలు రాసేయటం ఈ మధ్య అలవాటుగా మారిపోయిందంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు నిజమైన ప్రేమ ఇంతవరకు దొరకలేదని మాట్లాడిన రణ్ వీర్ ని ఏం చేస్తే బావుంటుందో సొట్టబుగ్గల సుందరే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika-Ranveer break up  speculations  deepika open up about break up  

Other Articles