చెర్రీ కోసం డోనాల్డ్ ట్రంప్ నిజమేనా? | donal trump special guest for cherry dance show

Donal trump special guest for cherry dance show

donal trump special guest for cherry dance show, donald trump ram charan, ram charan donald trump

donal trump special guest for cherry dance show.

చెర్రీ అమెరికా షోకి చీఫ్ గెస్ట్ ఎవరంటే...

Posted: 10/13/2016 05:33 PM IST
Donal trump special guest for cherry dance show

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఓవైపు సినిమాను శరవేగంగా పూర్తి చేసుకుంటూనే, 15వ తేదీన యూఎస్ లోని న్యూజెర్సీలో ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ''రిపబ్లికన్ హిందూ కొయిలిషన్'' (ఆర్.హెచ్.సీ) అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. దీంతో వచ్చే మొత్తాన్నిటెర్రరిస్ట్ బారిన పడి నష్టపోయిన కుటుంబాల్ని ఆదుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఇందుకోసం చెర్రీ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవటం లేదు.

అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలువబోతుంది ఎవరినో తెలుసా? ఇంకెవరు నిత్యం వివాదాలతో నోరు పారేసుకుంటూ అమెరికా అధ్యక్ష బరిలో తన అభ్యర్థిత్వం సంక్లిష్టం చేసుకున్న డోనాల్డ్ ట్రంప్. అవును... కార్యక్రమానికి ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరయి తనపై నెలకొన్న నెగటివ్ మార్క్, ముఖ్యంగా భారతీయుల దృష్టిలో (గతంలో ఇండియన్ల గురించి చెత్తగా వాగాడు లేండి) మంచోడిగా మార్కులు వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ నెల 15న అమెరికాలోని న్యూజెర్సీలో పీఎన్సీ ఆర్ట్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్న హ్యుమానిటీ ఎగైనెస్ట్ టెర్రర్ అనే ఈవెంట్‌ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో చెర్రీతో పాటు సిసింద్రీ అఖిల్ కూడా డాన్స్ చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రచార పర్వంలో తెగ బిజీగా ఉన్న ట్రంప్… ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది కాస్త సస్పెన్స్ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  ram charan dance show  

Other Articles