మోహన్ లాల్ మరో సంచలనం | Mohanlal movie fastest earn 20 crores in molly wood.

Puli murugan fastest ever to earn rs 20 crore in kerala

Mohanlal movie fastest earn, Puli Murugan collections, Mohanlal sensation in malayalam industry, Mohanlal and Jagapathi Babu movie

Mohanlal movie Puli Murugan fastest earn 20 crores in molly wood.

కంప్లీట్ యాక్టర్ రికార్డులు మొదలుపెట్టాడు

Posted: 10/13/2016 07:42 PM IST
Puli murugan fastest ever to earn rs 20 crore in kerala

మలయాళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కంప్లీట్ యాక్టర్ గా పేరున్న ఆయన ఈ మధ్య తెలుగులోను మనమంతా, జనతా గ్యారేజ్ తో చేరువయ్యాడు. ఇక ఇప్పుడు తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఆయన, తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.

ఇటీవలే 'ఒప్పం' సినిమాతో హిట్ కొట్టిన ఆయన, తాజాగా మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాపై సౌత్ మొత్తం ఇప్పుడు కన్నేసింది. ఇక రీసెంట్ గా ఆయన నటించిన 'పులి మురుగన్' సినిమా ప్రభంజనం రేపుతోంది. మల్లూవుడ్ లోనే 25 కోట్లతో(ఇదే అక్కడ హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇప్పటిదాకా) నిర్మించబడింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 20 కోట్లను వసూలు చేసింది. ఈ లెక్కన మరో వారం దాటితే సినిమా ఇప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన ప్రేమమ్ రికార్డును బద్ధలు కొట్టడం ఈజీగానే కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాను హిందీ .. ఇంగ్లిష్ భాషల్లోనే కాకుండా, చైనా .. వియత్నాం భాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా భాషల్లోను ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మోహన్ లాల్ క్రేజ్ ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్ రెట్టింపు అయ్యిందని ట్రేడ్ పండితులు చెప్పుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమాలో విలన్ ఎవరనుకుంటున్నారు మన జగపతి బాబుయే. ఆయన నటనకు కూడా అక్కడ మంచి ప్రశంసలు అందుతున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanlal  Mollywood  Puli Murugan  Collection  

Other Articles

Today on Telugu Wishesh