కాటమరాయుడు నుంచి ఇంకోకరు అవుట్ | New Cameraman Steps In for Katamarayudu

New cameraman steps in for katamarayudu

Cameraman prasad murella for Pawan, Katamarayudu cameraman exit, New Cameraman for Katamarayudu, ADK cameraman for Katamarayudu, One more exit from Katamarayudu, Pawan Katamarayudu, Katamarayudu updates, Katamarayudu telugu movie

Cameraman prasad murella replaces Soundar Rajan for Katamarayudu.

కాటమరాయుడి ఛేంజ్ మరోసారి

Posted: 09/22/2016 12:44 PM IST
New cameraman steps in for katamarayudu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ సెకండ్ షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పవన్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు కూడా. అయితే పవన్ సినిమాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీకుండా పోతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో దర్శకుడు, హీరోయిన్ దగ్గరి నుంచి చిన్న చిన్న టెక్నీషియన్స్ దాకా అందరూ మారిపోయారు. కాటమరాయుడి విషయంలో కూడా అదే జరగబోతుందని తెలుస్తోంది.

ఎస్ జే సూర్య నుంచి డైరక్షన్ లాక్కున్న డాలీ ఇప్పుడు పవన్ కోసం మరో ఛేంజ్ చేయబోతున్నాడని సమాచారం. అదే ఈ చిత్ర కెమెరా మెన్ మార్పు. తొలుత ఈ చిత్రానికి బెంగాల్ టైగర్ చిత్రానికి పని చేసిన సౌందర్ రాజన్ ను తీసుకున్నారు. అయితే ప్రాజెక్ట్ రాను రాను ఆలస్యం అవుతుండటంతో ఆయన ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయాడని సమాచారం. తాజాగా అందుతున్న వార్త ఏంటంటే... అత్తారింటికి దారేది చిత్రానికి చాయాగ్రాహకుడిగా పని చేసిన ప్రసాద్ మూరెళ్ల ఈ స్థానే తీసుకున్నారంట.

మరోవైపు ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూలోనే హీరోయిన్ శృతీహాసన్ కూడా పాల్గొనాల్సి ఉండగా, ఆ బ్యూటీ మాత్రం సూర్య సింగం 3 కోసం లండన్ చెక్కేసింది. దీంతో శృతీ కూడా ఈ ప్రాజెక్టు నుంచి ఎగ్జిట్ అయ్యిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఏదీ తేల్చుకోలేం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu  Cameraman  Prasad Murella  

Other Articles