దసరాకే కార్తీ కాష్మోరా సందడి | Karthi kashmora audio date announced

Karthi kashmora audio date announced

Karthi Kashmora, Kashmora audio launch, Karthi kashmora audio date, Kashmora updates, Kashmora telugu movie, kashmora Diwali Race, Kashmora release date, Karthi's Kashmora, Kashmora Trailer, Karthi Kashmora Trailer

Karthi kashmora audio date announced.

కాష్మోరా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Posted: 09/22/2016 12:35 PM IST
Karthi kashmora audio date announced

తమిళ్ కంటే తెలుగులోనే సూర్య బ్రదర్స్ కి కాస్త క్రేజ్ ఎక్కువుందన్న విషయాన్ని ఒప్పుకుని తీరాలి. సినిమా రిలీజ్ విషయంలోగానీ, ప్రమోషన్ విషయంలో గానీ అక్కడి కంటే ఇక్కడే ఎక్కువ సందడి చేస్తుంటారీ బ్రదర్స్. యేడాది మొదట్లో ఊపిరితో స్ట్రెయిట్ హిట్ అందుకున్న కార్తీ, ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోతున్నాడు. హర్రర్ కథాంశంగా కాష్మోరాతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు.

గోకుల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణసంస్థ పీవీపీ నిర్మించబోయే ఈ చిత్రంలో సుమారు 40 గెటప్ లలో కార్తీ సందడి చేయబోతున్నాడంట. పైన గుండు, కింద గడ్డంతో యుద్ధ వీరుడి గెటప్ లో డిఫరెంట్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, అది ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆడియో తేదీని కూడా అనౌన్స్ చేసేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 7 న చిత్ర ఆడియో, ట్రైలర్ రెండు భాషల్లో ఒకేసారి నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసేసింది.

హర్రర్ థ్రిల్లర్ గానే కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. కార్తీ సరసన ఇందులో నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. కబాలికి స్వరాలు సమకూర్చిన సంతోష్‌ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి కాష్మోరాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Kashmora  Audio Launch  Trailer  

Other Articles