రజనీ పంచ్ డైలాగ్ సూర్యకి బాగా హెల్పయ్యింది | suriya uses Rajani Punch dialogue Thaanaa Serndha Koottam

Suriya uses rajani punch dialogue

Baasha Dialogue for Suriya, Suriya 35th movie, Suriya Uses Rajani Punch Dialogue, suriya uses Rajani Punch dialogue, suriya uses Rajani Punch dialogue, Thaanaa Serndha Koottam dialogue, Thaanaa Serndha Koottam suriya, Thaanaa Serndha Koottam movie, vignesh shivan Suriya Movie Title

Suriya's next movie title taken from Rajinikanth's punch dialogue from baasha.

రజనీ పంచ్ తో ఏకంగా సినిమానా?

Posted: 09/22/2016 02:44 PM IST
Suriya uses rajani punch dialogue

ప్రపంచమంతా తనకున్న క్రేజ్ ఏంటో కబాలి రిలీజ్ సమయంలో కళ్లకు కట్టినట్లు చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆడా ఇడా అన్న తేడా లేకుండా అన్నిదేశాల్లో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టాడు. అందుకే రజనీ ఛరిష్మాను క్యాష్ చేసుకునేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తుంటారు మన హీరోలు. అడపాదడపా సౌత్ భాషల్లోని సినిమాల్లో  ఏదో సందర్భంలో తలైవాను వాడేసుకుంటుండగా, బాలీవుడ్ లో షారూఖ్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో రజనీ పంచ్ తో ఓ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.  

తాజాగా  కోలీవుడ్ కథానాయకులలో సూర్య చాలా దూకుడు చూపిస్తూ వెళుతున్నాడు. విరామమనేది తీసుకోకుండా ఆయన సినిమాలు చేస్తున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్య పెద్ద గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. 'సింగం 3' సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 16గా ప్రకటించిన ఆయన, తన తదుపరి సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. నటి నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి, 'తానా సెరిందా కూట్టం' అనే టైటిల్ ను తాజాగా ఖరారు చేశాడు.

ఇండియన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'బాషా' సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఇది. దానర్థం ''నా దగ్గర వున్న వాళ్లంతా తమంతట తాముగా వచ్చినవారే" అని. స్టైల్ గా రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఆ సినిమాలో అద్భుతంగా పేలింది. ఇప్పుడు ఈ డైలాగ్ ను టైటిల్ గా పెట్టి, అందరి దృష్టిని ఈ సినిమావైపు తిప్పడంలో సూర్య సక్సెస్ అయ్యాడు. మరో వైపు కబాలిలో నిరుప్పుడా సాంగ్ (తెలుగులో నిప్పురా) పేరుతో అల్రెడీ ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya  35th Movie  vignesh shivan  title  Rajani Punch dialogue  Thaanaa Serndha Koottam  

Other Articles

Today on Telugu Wishesh