అమెరికాలో ద్వారక పాటలు విడుదల | Dwaraka telugu movie songs released in US

Vijay devarakonda dwaraka songs released in us

Vijay Dewarakonda's Dwaraka, Vijay Dewarakonda's Dwaraka audio, Dwaraka audio in US, Dwaraka songs releaased

Vijay Dewarakonda's Dwaraka telugu movie songs released in US.

ద్వారక సందడి అక్కడ ముందుగానే...

Posted: 09/12/2016 11:47 AM IST
Vijay devarakonda dwaraka songs released in us

పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీ లో సంచలనంగా మారిపోయిన యువహీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ద్వారకా పాటలు యూఎస్ లో రిలీజ్ అయ్యాయి. కృష్ణాష్టమి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ కి మంచి స్పందన రాగా, ఇప్పుడు ఆడియోలోని కొన్ని ట్రాక్ లను ముందుగా అమెరికాలో విడుదల చేశారు.

సెప్టెంబర్ 10 న  తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో జరిగిన కార్యక్రమంలో అట్టహాసంగా లాంఛ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో, లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకుడు. ఇక ఈ ఈవెంట్ కు హీరో  నారా రోహిత్ గెస్ట్ గా హాజరయి ఆవిష్కరించాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఇప్పటికే విడుదలైన భజారే నందగోపాల కాగా దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ కార్యక్రమానికి తానా అధ్య‌క్ష్యుడు జంపాల చౌద‌రి, ఉమెన్ స‌ర్వీస్ కో ఆర్డినేట‌ర్ ర‌జ‌నీ, ట్రై తెలుగు అసోసియేష‌న్ యుగంధ‌ర్ ఏడ్ల‌పాటి, జ‌గ‌దీష్ కానూరుతో పాటు తెలుగు క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ ప‌ద్మ‌శ్రీ ముత్యాల త‌దిత‌రులు పాల్గొన్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పూజా జ‌వేరి ఇందులో విజయ్ కి జోడీగా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Dewarakonda  Dwaraka  songs  US  

Other Articles