రజనీ హీరోయిన్లకు కొత్త సెంటిమెంట్ పెట్టాడు | Nawazuddin Siddiqui Makes An Interesting Revelation

Nawazuddin siddiqui makes an interesting revelation

Nawazuddin Siddiqui Rajanikanth, Rajanikanth heroines, Nawazuddin Siddiqui heroines, Nawazuddin Siddiqui offer for Heroines, Superstar links with Nawazuddin Siddiqui

Nawazuddin Siddiqui intresting comments on Rajanikanth heroines.

రజనీ హీరోయిన్లకు కొత్త సెంటిమెంట్ పెట్టాడు

Posted: 09/12/2016 11:17 AM IST
Nawazuddin siddiqui makes an interesting revelation

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వయసులో పెద్దోడైనప్పటికీ ఆయన పక్కన ఏదో రూపంలో నటించే ఛాన్స్ వస్తే అదే అదృష్టంగా నేటి తరం హీరోయిన్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత వారి కెరీర్ లు పీక్స్ లోకి వెళ్లిపోవటం ఖాయమనే సెంటిమెంట్ ఏర్పడిపోయింది కాబట్టి. అలాంటి వాళ్ల కోసం ఓ సలహా ఇస్తున్నాడు బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.
 
రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించాలనుందా? అయితే అందుకో కండిషన్. ముందుగా నాతో నటించండి ...అంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగానే వున్నప్పటికీ, అతను దీనికి చిన్న లాజిక్ కూడా చెప్పాడు. "నాతో నటిస్తే ఆ తర్వాత రజనీకాంత్ ఆటోమేటిక్ గా ఆ హీరోయిన్ కి తన సినిమాలో ఛాన్స్ ఇస్తాడు. ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నాడు. ఆమధ్య 'మాంజీ' సినిమాలో నా పక్కన కథానాయికగా నటించిన రాధికా ఆప్టేకు.. రజనీ తన 'కబాలీ' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

ఆ తర్వాత 'ఫ్రీకీ అలీ' సినిమాలో నాతో నటించిన ఏమీ జాక్సన్ కు రజనీ తన 'రోబో' సీక్వెల్ లో ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా నాతో నటించిన ఇద్దరు హీరోయిన్లు రజనీ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. చూసుకోండి మరి, మన సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది" అంటూ హీరోయిన్లను కవ్విస్తున్నాడు నవాజుద్దీన్. పెద్దగా లాజిక్ లేకపోయినా ఫ్రీకీ అలీ సినిమా ప్రమోషన్ కోసం ఏదో ఇలా రజనీ పేరును వాడేసుకుంటున్నాడు సిద్ధిఖీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawazuddin Siddiqui  Rajanikanth  heroines  

Other Articles