సరైనోడును టచ్ చేయలేకపోయిన జనతా గ్యారేజ్ | Allu Arjun Sarrainodu's record safe from Janatha Garage

Allu arjun sarrainodu s record safe from janatha garage

Janatha Garage Sarrainodu, Sarrainodu total collections, Janatha Garage fails to beat, Janatha Garage total collections, Janatha Garage total collections not cross, 2016 tollywood highest grosser

NTR Janatha Garage fails to beat Sarrainodu total collections.

70 కోట్లు అయినా... ఆ సినిమా రికార్డు సేఫ్

Posted: 09/12/2016 01:04 PM IST
Allu arjun sarrainodu s record safe from janatha garage

టాలీవుడ్ యంగ్ టైగర్ జనతాగ్యారేజ్ ఎవరి ఊహకు అందని రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసింది. ఒక్క బాహుబలి తప్ప మరే చిత్రం సాధించలేని రికార్డులెన్నో బుడ్డోడి ఖాతాలోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్యారేజ్ కలెక్షన్లు చూస్తే ఆరాచకం అనిపించకమానదు. అయితే ఫాస్ట్ గా 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్ర ఫలితాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం విశేషం.

పోటీగా వచ్చిన చిత్రాలకు కూడా ఆదరణ బాగానే ఉండటంతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు కాస్త డల్ అయిపోయాయి.  ఇప్పటికే రమారమీ 70 కోట్ల క్లబ్ కి చేరువైన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరో ఐదారుకోట్లు వెనకేసుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.  యుఎస్ లో 1.7 మిలియన్ డాలర్లను అంటే 11.42 కోట్లను వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అభిమానులు ఆశించినట్లు ఎన్టీఆర్ కెరీర్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ అందించిన జనతా గ్యారేజ్ ఒక్క విషయంలో మాత్రం నిరాశ కలిగించేలా ఉంది.

ఊర మాస్ సరైనోడు హిట్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టోటల్ కలెక్షన్ల పరంగా టాలీవుడ్ లో 5వ ప్లేస్ లో నిలవటమే కాదు, ఈ యేడాది ఇప్పటిదాకా వచ్చిన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచాడు. గ్యారేజ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుదని అనుకున్నప్పటికీ ఆ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జ్యో అచ్యుతానంద, ఇంకొక్కడు ల కోసం స్క్రీన్ ల సంఖ్య తగ్గించగా, ఈ వారం మరో మూడు చిత్రాలు ఉండటం, వచ్చే వారం నాని మజ్ను ఉండటంతో చాలా థియేటర్లు ఎగిరిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ లెక్కన టాలీవుడ్ పరంగా తెలుగు నేలపై, ఓవర్సీస్ లో వండర్స్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్, బన్నీ సరైనోడు ఓవరాల్ కలెక్షన్లను దాటే అవకాశాలు కనిపించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Allu Arjun  Sarrainodu  total collections  

Other Articles