తమన్నా అభినేత్రి ట్రైలర్ విడుదల | Abhinetri Trailer launched

Abhinetri trailer launched

Tamanna Abhinetri Trailer, Abhinetri Trailer, Abhinetri Trailer review

Tamanna Abhinetri Trailer Launched.

తమన్నా కోసం మొత్తం మార్చేశారా?

Posted: 09/12/2016 10:00 AM IST
Abhinetri trailer launched

కెరీర్ ఇన్నాళ్లో కేవలం గ్లామర్ డాల్ గానే పరిమితమైన తమన్నాకు ఇంతదాకా లేడీ ఓరియంటల్ చిత్రాల్లో నటించే అవకాశమే రాలేదు. అయితే తొలిసారి కెరీర్ లో అభినేత్రితో ఆ ముచ్చట తీరబోతుందని అంతా భావించారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమలాపాల్ మాజీ భర్త విజయ్ దర్శకత్వం వహించాడు. కాగా, ప్రభుదేవా తమిళ్ లో, సోనూసూద్ హిందీలో, తెలుగకొచ్చేసరికి కోనవెంకట్ తెరకెక్కించారు.

అయితే ఇప్పటికే ఈ చిత్ర హిందీ అండ్ తమిళ్ ట్రైలర్ లు రిలీజ్ కాగా, వాటిల్లో సోనూసూద్, ప్రభుదేవాలను హైలెట్ చేయటంతో తమ్మూ డమ్మీ అవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ, తెలుగు ట్రైలర్ లో మాత్రం మొత్తం ఈ మిల్కీ బ్యూటీ షోనే నడిచేట్లుగా చూపించారు. డాన్సులు, యాక్టింగ్ లో తమన్నాను హైలెట్ గా చూపించారు. ఇక తెలుగు వర్షన్ కి తగ్గట్లుగా సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వీలతో కామెడీ బిట్లు చేయించారు. ట్రైలర్ విషయానికొస్తే...

పెద్దవాళ్ల బలవంతం మేరకు పల్లెటూరి పిల్ల తమన్నాను పెళ్లిచేసుకుని పట్టణం తీసుకొస్తాడు ప్రభుదేవా. అయితే ఆ ఇంట్లో ఒకప్పుడు ఉండి చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ తమన్నాలోకి ప్రవేశిస్తుంది. ఆపై హీరోయిన్ గా మారి ప్రభుదేవాకి చుక్కలు చూపిస్తుంది. ఇంతలో ఒక సినీ హీరో (సోనూ సూద్) ఆమెకు దగ్గరవుతుంటాడు. కానీ, ఆ ఆత్మ తమ్మూని పూనుకోవడానికి కారణం వేరే ఉంటుంది. అసలు ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తోనే సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Abhinetri Trailer  release  

Other Articles

Today on Telugu Wishesh