హను రాఘవపూడితో నితిన్ సినిమా ప్రారంభం | Nithin next with Hanu Raghavapudi launched

Nithin next with hanu raghavapudi launched

Nithin next with Hanu Raghavapudi, Nithin Hanu Raghavapudi movie launched, Nithin with 14 reels, Nithin new movie, Nithin movie after A Aa

Nithin next with Hanu Raghavapudi launched.

నితిన్ సినిమా అలా మొదలైందన్న మాట

Posted: 09/08/2016 06:26 PM IST
Nithin next with hanu raghavapudi launched

అ ఆ' సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత మూడు నెలలపైగానే కామ్ గా ఉన్న నితిన్ తన కొత్త చిత్రాన్ని గురువారం గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథల దర్శకుడు హను రాఘవపూడితో నితిన్ ఒక సినిమా చేయనున్నట్టు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సరిగ్గా ఆ సినిమానే లాంచ్ చేశారు. హైదరాబాద్ లోని నిర్మాతల కార్యాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ ను స్రవంతి రవికిశోర్ చేతుల మీదుగా హను రాఘవపూడి అందుకున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా .. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు షాట్ ను దేవుడి పటాలపై చిత్రీకరించారు. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమా, డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కనుంది.

నిజానికి ఈ సినిమా అక్కినేని కాంపౌండ్ లోనిది. అఖిల్ తన రెండో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందించాలని చూడటం, మరోవైపు హను 14 రీల్స్ వారితో ఎగ్రిమెంట్ చేసుకోవటంతో సదరు ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే 14 రీల్స్ సంస్థ నితిన్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  నవంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Hanu Raghavapudi  14 reels movie  launch  

Other Articles