రేఖ ఆత్మకథలో సెలబ్రిటీల షాకింగ్ కామెంట్లు | Celebs criticized Rekha over her husband’s suicide

Celebs criticized rekha over her husband s suicide

Celebs criticized Rekha at her husband’s suicide, Anupam Kher Rekha, Subhash Ghai Rekha, Rekha Biography, Yasser Usman book on Rekha, Rekha husband Mukesh Agarwal, Yasser Usman Rekha

Celebs criticized Rekha in her biography written by Yasser Usman. Subhash Ghai, Anupam Kher criticized Rekha over her husband’s suicide.

రేఖ ఆత్మకథలో బూతులు పేలుతున్నాయి

Posted: 09/08/2016 04:37 PM IST
Celebs criticized rekha over her husband s suicide

మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ను ఏలిన నటి రేఖ ప్రేక్షకుల పాలిట సెక్సిణిని గా మారిపోయింది. 1980 ముందు వరకు ఆమె ఓ సాధారణ నటి మాత్రమే. కానీ, ఆ తర్వాత దశాబ్దంన్నరపాటు ఆమె హిందీ చిత్ర పరిశ్రమను ఏలింది. ప్రస్తుతం ఆమె భారతీయ చిత్ర పరిశ్రమకు ఓ పెద్దగా వ్యవహరిస్తోంది. కానీ, ఈ స్టేజీకి చేరుకోవటానికి ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఆమె లైంగిక వేధింపులకు కూడా గురైందన్న విషయం ఓపెన్ సీక్రెట్ గానే ఉంది.

ప్రముఖ నటుడు జెమిని గణేషన్ కూతురు అయినప్పటికీ, ఏనాడూ ఆయన పరపతిని వాడుకోకపోవటమే ఆమె చేసిన తప్పు. అమితాబ్ తో అఫైర్ , ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవటం, ఆ మరణం వెనుక రేఖ హస్తం ఉందనే ఆరోపణలు రావటం ఇవన్నీ ఆమె జీవితంలోని చీకటి కోణానికి పరాకాష్టలు. ఇదిలా ఉండగా యాసిర్ ఉస్మాన్ అనే రచయిత రాసి వెలువరించిన ఆమె ఆత్మకథ పుస్తకం ఇప్పుడు సంచలనాలకు నెలవుగా మారింది.

ముఖ్యంగా ఆమె భర్త ముకేష్ అగర్వాల్ చనిపోయిన సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆమెను విమర్శిస్తూ చేసిన కామెంట్లను ఆయన యాజ్ ఇట్ ఈజ్ గా ప్రచురించడమే దీనికి కారణం. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ రేఖ గురించి మాట్లాడుతూ... ఆమె దేశానికి ఒక వ్యాంప్ గా మారిపోయిందని, సినిమాల పరంగానే కాదు,,, వ్యక్తిగతంగానూ ఆ ట్యాగ్ లైన్ తగిలించిందని, అది ఆమెకు సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించాడు. ఇక ప్రముఖ ఫిల్మ్ మేకర్ సుభాష్ ఘాయ్ రేఖ గురించి ప్రస్తావిస్తూ రేఖ మూలంగా ఇండస్ట్రీలో ఓ మాయని మచ్చ ఏర్పడింది. అందుకే ఏ దర్శకుడు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు రావటం లేదంటూ వ్యాఖ్యానించాడు.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.     

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rekha  husband  Mukesh Agarwal  Suicide  Anupam Kher  Subhash Ghai  Yasser Usman  

Other Articles