గురు టైటిల్ ఆయన కోసమే బుక్ చేశారా | venky Saala Khadoos remake title Guru

Venky saala khadoos remake title guru

Venky salakhadoos remake, Guru title fix for venky Saala Khadoos, Saala Khadoos Guru, venky Saala Khadoos remake, venky Saala Khadoos remake details, Guru title fix for venky Saala Khadoos, venkatesh turn Guru, Venkatesh as bocxing Guru

Guru title fix for venky Saala Khadoos remake

గురు టైటిల్ ఆయన కోసమే బుక్ చేశారా?

Posted: 09/09/2016 10:02 AM IST
Venky saala khadoos remake title guru

బాబు బంగారం సినిమా సినిమా రిజల్ట్ సంగతి ఏమో గానీ, వెంకీని మాత్రం బాగా ఎంటర్ టైనింగ్ గా చూపాడంటూ మారుతిపై బాగానే ప్రశంసలు కురిశాయి. అలాంటి వెంకీ ప్రస్తుతం జిమ్ లో తెగ వర్కవుట్ లు చేసేస్తున్నాడు. ఎందుకంటారా? త్వరలో సాలా ఖడ్డూస్ రీమేక్ చిత్ర షూటింగ్ లో పాల్గొనాలి కదా. బాక్సింగ్ కోచ్ గా కనిపించాలంటే ఫిట్ గా ఉండాలిగా మరి. మాతృక దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనికి గురు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఓ సాధారణ యువతిని బాక్సింగ్ క్రీడలో విజేతగా తీర్చిదిద్దే కోచ్ పాత్రలో ఇందులో వెంకి నటిస్తున్నాడు. అందుకే దానికి ఈ టైటిల్ అయితే బావుంటుందని భావిస్తున్నారు. హిందీ, తమిళ్ వర్షన్లో నటించిన రితికా సింగ్ ఇందులో కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

వెంకీకి రీమేక్ ల సినిమాలు హిట్లుకావటం సెంటిమెంట్ గా తయారయ్యింది. ఈ నేపథ్యంలో సాలాఖడ్డూస్ కూడా వెంకీకి సక్సెస్ ఇవ్వటం ఖాయంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో చెన్నైలో మొదలవుతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  sala khadoos  remake  title  Guru  

Other Articles