మహేష్-మణిరత్నం సినిమా ఆగిపోవటానికి కారణం | Mani Ratnam Mahesh movie shelved for this reason

Mani ratnam mahesh movie shelved for this reason

Mahesh maniratnam movie, mahesh maniratnam Ponniyin Selvan, Ponniyin Selvan shelved, reason for mahesh maniratnam movie, mahesh maniratnam movie cancelled, Writer Jeyamohan about Ponniyin Selvan, Mahesh Babu Ponniyin Selvan

Writer Jeyamohan reveals why Mani Ratnam Mahesh Babu Ponniyin Selvan was shelved.

బడ్జెట్ కారణంగానే మహేష్ సినిమా ఆగిపోయిందట

Posted: 09/08/2016 01:25 PM IST
Mani ratnam mahesh movie shelved for this reason

టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకు ఇండియా లో ఉన్న క్రేజ్ మాములుది కాదు. నటశేఖరుడి వారసుడిగా ఎదిగిన ప్రిన్స్ తో పనిచేయాలని నార్త్, సౌత్ అన్న తేడాలేకుండా డైరక్టర్లు, హీరోయిన్లు అవకావం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటిది తన ఫెవరెట్ దర్శకుల్లో ఒకడయిన మణిరత్నం తో పని చేసే అవకాశం వచ్చినా మహేష్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అన్న దానిపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సమాధానం వెలుగులోకి వచ్చింది.

కొన్నేళ్ల కిందట పొన్నియన్ సెల్వన్ అనే పేరుతో ఓ భారీ హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మణిరత్నం ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, అనుష్క శెట్టి, విజయ్, విశాల్ ప్రధాన తారగణంగా దీనిని తెరకెక్కించేందుకు మణి సిద్ధమయ్యాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవటంపై రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. మహేష్ డేట్లు అడ్జస్ట్ కాలేదని, విశాల్ అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటుండగా, మిగిలిన ఇద్దరు టాప్ హీరోలు ఇందులో నటించేందుకు సుముఖత చూపడటం లేదని, కథ చాలా రిస్కీగా ఉండటంతో కాస్టింగ్ ఒప్పుకోలేదని ఇలా ఏవేవో చెప్పుకున్నారు. అయితే తాజాగా దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటో చెప్పేశాడు ప్రముఖ రచయిత జయమోహన్.

చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావటంతో సినిమాలో చాలా వరకు షూటింగ్ దేవాలయాల్లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే తమిళనాడులో చాలా గుళ్లు ఉన్నప్పటికీ ఎవరూ షూటింగ్ కి సహకరించలేదు. దీంతో ప్రత్యేక సెట్లు వేయించి కానిచ్చేద్దామని మణి భావించాడు. సినిమాను మొత్తం 200 కోట్లతో తెరకెక్కిద్దామని అనుకున్నాం. కానీ, సెట్ల కోసమే బడ్జెట్ 50 కోట్లు అవుతుందని తేలింది. అందుకే ప్రాజెక్టును ఆపేయాల్సి వచ్చింది అని జయమోహన్ వివరించాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ponniyin Selvan  Mani Ratnam  Mahesh Babu. Shelved  Jeyamohan  

Other Articles

 • Naga shaurya s lakshya worldwide release date is out

  రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య ‘లక్ష్య’

  Sep 27 | మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు... Read more

 • Konda polam trailer of adventure action and determination

  ఉత్కంఠ రేపుతున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

  Sep 27 | వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం కొండ‌పొలం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మేకర్స్... Read more

 • Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

  టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

  Sep 27 | తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్... Read more

 • Sharwanand s maha samudram trailer looks intense

  ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

  Sep 24 | ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి... Read more

 • Ram charan unveils amusing stress reliever anubhavinchu raja teaser

  రామ్ చరణ్ విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్

  Sep 24 | రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్... Read more

Today on Telugu Wishesh