హీరోయిన్ కాకపోయినా అనుష్క హ్యాపీనేఅంట | Anushka shetty planning To end career

Anushka shetty planning to end career

Anushka shetty about her carrer, Anushka shetty retire from movies, Anushka shetty marriage, Anushka shetty decade carrer, anushka shetty about her personal life

Anushka shetty about her carrer and hint to planning to end her career.

అనుష్క వైరాగ్యం వెనుక అసలు రీజన్...

Posted: 09/08/2016 10:36 AM IST
Anushka shetty planning to end career

పదేళ్లుగా నిర్విరామంగా సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క కెరీర్ నెమ్మదిగా నిదానించింది. ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి, నమో వెంకటేశాయలో గెస్ట్ రోల్ తప్పించి ఆమె ఖాతాలో చిత్రాలేవీ లేవు. మరి సినిమాలకు ముగింపు చెప్పేసి పెళ్లి చేసుకుంటుదా? అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమెను అడిగితే ఏంమంటుందో తెలుసా?

పదేళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నాయికిగా కొనసాగాను అది చాలూ. చిన్నప్పుడు తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు తనకు నచ్చేవి కావని, సినీరంగంలోకి వచ్చాక కూడా ఇదే భావన ఉండేదని చెప్పుకొచ్చింది. ‘అప్పట్లో నాకు చాలా తక్కువమంది స్నేహితులు ఉండేవారు. కానీ సినిమాల్లోకి వచ్చాక నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ షూటింగ్‌లు, ఆటోగ్రాఫ్‌లతోనే గడిచిపోతోంది. అదృష్టవశాత్తూ సినీరంగం ద్వారా సంపాదించిన కీర్తి నెత్తికెక్కలేదు’ అంటూ వివరించింది.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎప్పుడెప్పుడు ఇంటికి పారిపోదామా అని అనిపించేందని పేర్కొంది. ఇంటిలో అడుగుపెట్టాక సినిమాల సంగతి మరిచిపోయి, అందరితో కలిసిపోతాను. అలాంటి లైఫ్ నాకు చాలా ఇష్టం ఒక వేళ సినిమాలు లేకపోయినా ఆ జీవితం నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. ప్రస్తుతం నా వయసుకు తగ్గ పాత్రలే వస్తున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉందంటూ పెళ్లి మాటను దాటవేసి కాస్త వైరాగ్యంగా మాట్లాడి త్వరలో రిటైర్ అవుతున్నానంటూ పరోక్షంగా సంకేతాలు అందజేసింది స్వీటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka shetty  decade carrer  personal life  

Other Articles