రాధికా ఆప్టే పుట్టినరోజు ప్రత్యేకం | Radhika Apte birthday special

Radhika apte birthday special

Radhika Apte birthday special, Radhika Apte birthday, unknown facts about Radhika Apte, Intresting facts about radhika apte, facts about Radhika Apte, Radhika Apte special, Radhika Apte personal life, Radhika Apte life, Radhika Apte filimography

Radhika Apte birthday special

హ్యాపీ బర్త్ డే రాధికా ఆప్టే

Posted: 09/07/2016 04:00 PM IST
Radhika apte birthday special

వివాదాలు ఆమె పేరు వింటే చాలూ చుట్టుముడతాయి , అయినప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదు. తాను చేస్తున్న క్యారెక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అదే లక్ష్యంగా పని చేస్తుంటుంది. ఆమె ఎవరో కాదు. బహుభాషా నటి రాధికా ఆప్టే. ఈ రోజు ఆమె 31వ పుట్టిన రోజు ఈ సందర్భంగా తెలుగు విశేష్ తరపున బర్త్ డే విషెష్ తెలియజేస్తూ రాధికా గురించి కొన్ని విషయాలు...

రాధికా ఆప్టే 1985 సెప్టెంబర్ 7 న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. సహ్యద్రి ఆస్పత్రుల యాజమాని డాక్టర్ చారుదత్ కూతురు. స్కూల్ డేస్ నుంచే నటన మీద మక్కువ పెంచుకున్న రాధిక నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 2005 లో వచ్చిన వాహ్ లైఫ్ హో తో ఐసీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసిన రాధిక, 2009 లో బెంగాలీ చిత్రం అంతాహీన్, మరాఠీ చిత్రం సమంతార్ తో పూర్తిస్థాయి హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు విషయానికొస్తే 2010 రక్త చరిత్రతో పరిచయమై ప్రకాశ్ రాజ్ ధోనీ, బాలయ్య సరసన లెజెండ్, లయన్ లో నటించి మెప్పించింది.  హిందీలో బద్లాపూర్, అడల్ట్ కామెడీ హాంటర్, మాంఝీ, ఫోబియా లతో మంచి గుర్తింపు సాధించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏకంగా రజనీకాంత్ కబాలిలో నటించే ఛాన్స్ కొట్టేయటంతోపాటు, తన కెరీర్ లో మరిచిపోలేని హిట్ అందుకుంది.

ఇక రాధికా కి స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్.. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అని తేడా లేదు. ఎక్కడ ఛాన్స్ వస్తే చాలూ అక్కడ జీవించేయడం ఆమెకు అలవాటు. ది కాలింగ్, ‘అహల్య’ ‘కృతి’ వంటి షార్ట్ ఫిల్మ్స్ ఆమె కెరీర్ కు చాలా ఉపకరించాయి. వివాదాలు ఆమెకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఫేక్ నగ్న ఫోటోలు, సినిమాలకు సంబంధించి న్యూడ్ సీన్ లీకులు ఆమెను ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినా అవి ఆమె కెరీర్ ను పైకి తీసుకెళ్లేందుకే చాలా ఉపకరించాయి.

రాధిక వ్యక్తిగత జీవితానికొస్తే లండన్ లో సంవత్సరం పాటు నటనలో ట్రెయినింగ్ లో ఉండగా బ్రిటీష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్‌ టేలర్‌ ను వివాహం చేసుకుంది. ‘కెమెరా ముందు నిలబడాలి, నటించాలి. అంతేతప్ప అది ఏ స్థాయి సినిమా అన్నది ఆలోచించకూడదు ’ అన్న మాటలతో రాధికా ఆప్టే ఏ స్థాయి నటి అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  31st  birthday  special  

Other Articles