బాహుబలి ఫారిన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో | Baahubali listed in blockbusters hollywood wishes they’d made

Baahubali listed in blockbusters hollywood wishes they d made

blockbusters hollywood wishes they’d made, baahubali in foriegn blockbuster list, foriegn blockbuster list, Hollywood make foriegn blockbuster list, baahubali unique record, baahubali 12th place, screenrant list, screenrant about baahubali

Baahubali listed in blockbusters hollywood wishes they’d made

ఫారిన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాహుబలి

Posted: 09/07/2016 03:10 PM IST
Baahubali listed in blockbusters hollywood wishes they d made

బాహుబలి సుమారు వందేళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రం కూడా సాధించనన్ని రికార్డులు, ఫీట్లు సాధించి పెట్టింది ఈ సౌత్ మూవీ. ప్రమోషన్ల దగ్గరి నుంచి మొదలయిన బాహుబలి మేనియా రిలీజ్ అయి ఏడాది పూర్తయిన ఇప్పటికీ ఏదో ఒక దగ్గర చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా ఏ ఇండియన్ మూవీ కూడా సొంతం చేసుకోని అరుదైన రికార్డును బాహుబలి సొంతం చేసుకుంది.

హాలీవుడ్ తయారు చేసిన ఫారిన్ బ్లాక్ బస్టర్ల (హాలీవుడ్ కాకుండా) జాబితాలో బాహుబలి ప్లేస్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా ప్రతీ విషయంలోనూ రాజమౌళి తీసుకున్న అంశాలను ప్రస్తావిస్తూ స్క్రీన్ రాంట్ .కామ్ అనే ప్రముఖ పోర్టల్ ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 15 సినిమాలు ఎంపిక కాగా అందులో బాహుబలి 12వ స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేస్థాయిలో చేసిన ప్రమోషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడ్తలు కురిపించింది. సోషల్ మీడియాను వాడుకోవటం, బిగ్ పోస్టర్ తో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కటం, ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో మూడో స్థానంలో నిలవటం తదితర విషయాలను అందులో పేర్కొంది.

ఓ రాజకుమారుడు తన మూలాలను వెతుక్కుంటూ వెళ్లటం లాంటి కథను పాశ్చాత్య శైలిలో తెరకెక్కించడంతోపాటు, అందుకు తగ్గ కాస్టింగ్, మ్యూజిక్, భారీ యుద్దసన్నివేశాలు... ఇలా రాజమౌళి తీసుకున్న ప్రతీ జాగ్రత్తను చెబుతూ ప్రశంసించింది. ఇక ఈ జాబితాలో లెజెండ్ మేకర్ అకీరా కురోసోవా తీసిన రాన్ (జపనీస్ ) టాప్ ప్లేస్ లో ఉండగా, కుంగ్ ఫు హస్టలే, సిటి ఆఫ్ గాడ్, ద హోస్ట, టోనీ జా ఓంగ్ బ్యాక్ లు కూడా  చోటుదక్కించుకోవటం విశేషం. కూడా మొత్తానికి బాలీవుడ్ చిత్రాలు కూడా సాధించలేని ఈ అరుదైన ఫీట్ ను సాధించిన బాహుబలి సెకండ్ పార్ట్ తో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali  hollywood wishes they’d made  foriegn blockbuster list  

Other Articles