మీలో ఎవరు కోటీశ్వరుడు వ్యాఖ్యతగా చిరు | chiru replaces nag for MEK show

Chiru replaces nag for mek show

chiru replaces nag, chiru for MEK season 4, Meelo Evaru Koteeswarudu season 4, MEK 4 Chiru, Chiru television debut, nag out from MEK, MEK new season

chiru replaces nag for MEK show season 4.

నాగ్ ప్లేస్ లో చిరు నిజమేనా?

Posted: 09/07/2016 05:39 PM IST
Chiru replaces nag for mek show

సామాన్యుడి ఇంటి తలుపులు తట్టి దూసుకెళ్లి టీవీషోలలోనే నంబర్ వన్ టీఆర్పీ సొంతం చేసుకుని తెలుగులో మంచి రికార్డులు క్రియేట్ చేసింది మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం. మా టీవీలో ప్రసారమయిన ఈ కార్యక్రమం మూడు సిరీస్ లో పూర్తి చేసుకుని త్వరలో నాలుగో దానికి సిద్ధమైపోతుంది. అయితే ఈ కార్యక్రమం ఇకపై చిరు చేతికి అందబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును మా టీవీలో ఒక పార్టనర్ గా కొనసాగిన చిరంజీవికి డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోయే నాలుగో సిరీస్ కి వ్యాఖ్యతగా వ్యవహరించాలన్న ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ లోపు 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 కూడా షూటింగ్ పూర్తిచేసుకుని చిరు ఫ్రీ అయిపోతాడంట. మరోవైపు తనయుల పెళ్లిళ్ల కారణంగానే నాగ్ ఈ షో నుంచి తప్పుకోబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాగ్ నుంచి హాట్ సీటును లాక్కుంటున్న చిరు దానికి ఏమేర న్యాయం చేస్తాడా? అన్నది చూడాలి. తొలి సీజన్ తర్వాత మిగతా రెండు సీజన్లకు టీఆర్పీ రేటింగ్ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. దీంతో మెగా మ్యాజిక్ తో మళ్లీ పూర్వవైభవం రాబట్టాలన్న ఆలోచనలో యాజమాన్యం ఉంది. మొత్తానికి ఈ వార్త నిజమైతే మాత్రం టెలివిజన్ డెబ్యూతో మెగా స్టార్ ఏమేర ఆకట్టుకుంటాడో అని అభిమానులంతా ఆశగా చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiru  replace  nagarjuna  MEK  4th season  

Other Articles