శాతకర్ణి షూటింగ్ లో చేరిన హేమా మాలిని | Hema Malini join in Gautami Putra Satakarni shooting

Hema malini join in gautami putra satakarni shooting

Hema Malini join in Gautami Putra Satakarni shooting, Hema Malini about Gautami Putra Satakarni , Gautami Putra Satakarni mother Hema Malini, Hema Malini about balayya, Gautami Putra Satakarni dhooting, Balayya about Hema Malini, Hema Malini tweets about Gautami Putra Satakarni, Krish about Hema Malini, Hema Malini about Krish

Hema Malini join in Gautami Putra Satakarni shooting.

శాతకర్ణి షూటింగ్ కి ఆమె వచ్చేసింది

Posted: 08/29/2016 05:18 PM IST
Hema malini join in gautami putra satakarni shooting

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే జరిగిన షెడ్యూల్లో మొరాకో, జార్జియాలలో కీలక యుద్ధ సీన్లతోపాటు, హైదరాబాద్ లో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మధ్యలో క్రిష్ వివాహం సందర్భంగా షూటింగుకి కొంత అంతరాయం కలిగింది. ఇక హనీమూన్ సెలవులు ముగియటంతో క్రిష్ మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాడు.

తాజా షెడ్యూల్ ను మధ్యప్రదేశ్ లో చిత్రీకరించేందుకు రంగాన్ని సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఏకధాటిగా రాజమహల్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ తల్లిపాత్రలో ఎవర్ గ్రీన్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటిస్తుండగా, బాలయ్య వైఫ్ రోల్ లో శ్రియ కనిపించనుంది. ఈ షెడ్యూల్లోనే హేమమాలిని షూటింగ్ లో పాల్గొననుంది. దీంతో ఆమె తన ట్విట్టర్ లో ఈ విషయాలను పేర్కొంది.

‘తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ‘గౌతమి’గా నటిస్తుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా. తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆంధ్రా (ప్రస్తుతం తెలంగాణ) రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను’’ అని హేమమాలిని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా గురించి హేమా మాలిని బాగానే స్టడీ చేసిందని తెలుస్తోంది. పవర్ ఫుల్ మదర్ రోల్ లో కనిపించాలంటే ఆ మాత్రం తెలుసుకుని ఉండాలి కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautami Putra Satakarni  Hema Malini  Balayya  Mother role  Shoot  

Other Articles